breaking news
Nimisha
-
Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్‌ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్‌కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్‌బుక్‌లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది. -
నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్‌మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది. -
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు: కేంద్రం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది. అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1— Werindia (@werindia) July 29, 2025సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. -
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!
సనా: భారతీయ నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమెకు మరణశిక్ష రద్దుచేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
‘దయ చూపండి.. మా అమ్మ ఉరిశిక్షను ఆపండి’
యెమెన్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవన్మరణ పోరాటం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు క్రితం ఆమెకు పడాల్సిన ఉరిశిక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిమిష. బ్లడ్‌మనీ(క్షమాధనం లేక నష్టపరిహారం) ఇచ్చేందుకు కూడా సిద్ధమైన తరుణంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే బాధిత తలాల్ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం తమకు బ్లడ్‌మనీ వద్దని ఇప్పటికే తెగేసి చెప్పింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దాంతో నిమిష ఉరిశిక్ష రద్దు అనేది పక్కకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా నిమిష కూతరు 13 ఏళ్ల మిషెల్ తన తల్లియందు దయ చూపించాలని యెమెన్ అధికారుల్ని వేడుకోంటుంది. ఈ మేరకు మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో తల్లిని రక్షించాలంటూ ప్రాధేయపడుతోంది. ‘ఐ లవ్ యూ మమ్మీ. ఐ మిస్ యూ. మా అమ్మను తిరిగి వెనక్కి పంపడానికి సాయం చేయండి. మా అమ్మ పట్ల దయ చూపండి. తలాల్ కుటుంబానికి థాంక్స్ చెప్పేందుకు మిషెల్ ఇక్కడ ఉంది. మీరు మా అమ్మపై కరుణ చూపి అక్కడ నుంచి విడుదలకు మార్గం చూపండి. రేపు, రేపు మరుసటి రోజు మీ పట్ల మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని వేడుకుంటోంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌తో కలిసి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్‌లో తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎ పాల్‌తో కలిసి నిమిష కూతురు మిషెల్ మీడియాతో మాట్లాడింది. -
అమానుషంపై స్పందించి తీరుదాం!
నాకెందుకో నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరచకపోవచ్చు అనిపిస్తోంది. ఇరాన్ అండదండలున్న హూతి దళాల పాలనలో ఉన్న యెమెన్‌లోని భాగంలో షరియా చట్టం అమలులో ఉంది. కేరళకు చెందిన 38 ఏళ్ళ నర్సు నిమిష ప్రియ ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిందంటూ అక్కడి చట్టం ఆమెకు మరణ దండనను విధించింది. హూతీల రాజకీయ, న్యాయ పాలనా సౌధంలో ప్రతి ఒక్కరు ఆ శిక్షను ధ్రువపరచేశారు. పాలక్కాడ్‌లో జన్మించిన ఆ క్రైస్తవ మతస్థురాలు అరెస్టు అయి, శిక్షపడినప్పటి నుంచి ఇప్పటికి అనేక నెలలుగా ఫైరింగ్ స్క్వాడ్ ను ఎదుర్కోవలసిన స్థితిలో ఉంది. మరణ దండనను అమలుపరచేందుకు యెమెన్‌లో కాల్పులు జరిపి చంపే విధానం అమలులో ఉంది. నాలుగు ఆశలువర్తమాన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారతదేశానికున్న ప్రాధాన్యం వల్లనైతేనేమి లేదా నిమిష కేసు దాదాపుగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్లనైతేనేమి లేదా మరణ దండనకు వ్యతిరేకంగా ఇరాన్, సౌదీ అరేబియాలు యెమెన్‌కు నచ్చజెప్పడం వల్లనైతేనేమి ఆ దేశం బుల్లెట్లకు ఇంకా పనిచెప్పలేదు. నిమిషను కాపాడేందుకు ‘సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్’ పేరుతో కొందరు ఒక సంఘంగా ఏర్పడ్డారు. నిమిష లీగల్ డిఫెన్స్‌ను సమన్వయపరచుకుంటూ ఆ కౌన్సిల్ పనిచేస్తోంది. కేరళలోని ఇస్లామిక్ మత పెద్దలు, ప్రసిద్ధ స్కాలర్లు బహిరంగంగా, తెర వెనుక మార్గాల ద్వారా శిక్షను ఆపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు వృథా పోవని అనిపిస్తోంది. మరణ దండనకు గురిచేయకుండా ఆమెను విడిచిపెట్టవచ్చుననడానికి నాకు మరో నాలుగు కారణాలు తోస్తున్నాయి. ఒకటి– షరియా అమలులో ఉండటం నిజం. హతుని కుటుంబ ఆగ్రహం కూడా అర్థం చేసుకోదగిందే. నమ్మశక్యం కాకపోయినా, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని ప్రపంచం అసహ్యించుకుంటుందని సానా(యెమెన్ రాజధాని) లోని అధికార వర్గాలకు తెలియదనుకోలేం. రెండు– యెమెన్‌లోని ఆ భాగంలో ఉన్న అధికారులు మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు జవాబుదారులు ఏమీ కారు. గతంలో మరణ దండనలను గణనీయంగానే అమలు జరిపి ఉండవచ్చు. అంతమాత్రాన, ప్రపంచ మనోభిప్రాయాన్ని లెక్క చేయనివారుగా బాహాటంగా కనిపించకూడదని వారు అనుకుంటూ ఉండవచ్చు. మూడు– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వంటి సమర్థులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నారు. పరాయి దేశంలో బందీగా ఉన్న ఒక భారతీయ మహిళను కాపాడలేకపోయినదిగా కనిపించడం భారత ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. నిమిష ప్రాణాలను కాపాడేందుకు హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రయత్నించాలో అంతా న్యూఢిల్లీ చేస్తుంది. నాలుగు– హతుని కుటుంబం దోషిని క్షమించినందుకు పరిహారంగా ఇచ్చే నగదు(బ్లడ్ మనీ) మొత్తంపైనే ఇపుడు సంప్రదింపులు సాగుతున్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రభుత్వం పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రపంచంలోనే నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నగదు కొరతతో బాధపడుతున్నదిగా ముద్రపడలేదు.ఒకవేళ ఆశలు అడియాసలైతే...పైన పేర్కొన్న కారణాలన్నింటివల్ల నిమిష ప్రియను కాపాడారు అనుకుందాం. అదృష్టం బాగుండి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది అనుకుందాం. ఆమెకు ఘన స్వాగతం లభిస్తుంది. ఆమె ప్రాణాలను కాపాడిన ఘనత తమదేనని చెప్పుకునేవారూ చాలా మంది ఉంటారు. కానీ, నా ఈ అంచనాలన్నీ ఘోరంగా తలకిందులు కావచ్చు. సానాలోని పాలకులు నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరిస్తే, నేను పైన చెప్పిన విషయాలన్నీ బుద్ధి హీనమైనవిగా తేలతాయి. నిజంగానే, ఘోరం జరిగితే, భారత్ ఏం చేయవలసి ఉంటుంది? భారత్ తన అసంతృప్తిని సానాకు తెలిపి తీరాలి. ‘‘ఇది టెర్రరిజం కేసు కాదు కదా. ఆ పని భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. ఆ చర్య భారత రాజ్య వ్యవస్థకు లేదా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు’’ అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే, సానాలోని రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైనదని ప్రపంచం గుర్తించలేదు. అటువంటి వ్యవస్థ తమ దేశంలో ఉంటున్న ఒక భారతీయురాలి జీవితాన్ని అంతమొందిస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? అందులోనూ ఆమె సేవా భావంతో నిండి ఉండే నర్సింగ్ వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆమెకు అలాంటి గతి పట్టవచ్చా? అనేక దేశాలలో వివిధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న భారతీయులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిలో నర్సులు గణనీయమైన వర్గం కిందకు వస్తారు. ఆ యా దేశాలు అన్నింటి దృష్టిలో మనం చులకన అయిపోమా? నిమిష చేసిన నేరం తక్కువదేమీ కాదు. దాన్ని గర్హించకుండా ఉండటమో లేదా ఉపేక్షించడమో చేయలేం. దాన్నలా ఉంచినా, హతుని దేహాన్ని ఆమె ముక్కలు చేసిన తీరు ఇంకా ఘోరం. కానీ, ఆమె హంతకురాలిగా మారడానికి పురికొల్పిన అంశాలను కూడా విస్మరించలేం. అటువంటి నేరమే భారతదేశంలో జరిగి ఉంటే, దిగువ కోర్టు ఉరి శిక్ష విధించినా సంబంధిత హైకోర్టు లేదా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదు శిక్షగా తగ్గించే అవకాశాలు ఎక్కువ. కోర్టులన్నీ మరణ దండనను సమర్థించినా, క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించి శిక్షను తగ్గించే అవకాశమూ ఉంది. అసంతృప్తిని చాటి తీరాలి!సరే. అది ఇపుడు అప్రస్తుతం. దేశపు చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందని కొన్ని శక్తుల నియంత్రణలో ఉన్న యెమెన్‌లోని ఒక భూభాగంలో ఫైరింగ్ స్క్వాడ్ నిమిషను కాల్చి చంపితే, ఇండియా ఎలా స్పందించాలి? ఆపరేషన్ రాహత్ కింద, ఆ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యెమెన్‌లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొద్ది వేల మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. వారినందరినీ ఏకమొత్తంగా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని భారత్ పరిశీలించవలసి ఉంటుందా? వారిలో కొంత మందికి స్వదేశానికి రావడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఆ పని చేయాలా? దానివల్ల యెమెన్‌కు వాటిల్లే నష్టం ఏమైనా ఉంటుందా? అక్కడున్న భారతీయుల భద్రత పట్ల భారత్‌కు నమ్మకం కలగడం లేదనే అంశాన్ని మనం వెల్లడించి తీరాలి. యెమెన్‌లోని ఆ ప్రాంతంతో వాణిజ్యాన్ని (అది లెక్కలోకి వచ్చేది కాకపోయినా) మనం తీవ్రంగా పరిమితం చేయాలి. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని మనం ఈ విషయంలో అనుసరించినా తప్పు లేదు. కానీ, నేను మొదట ధైర్యంగా అనుకుంటున్నదే నిజమవ్వాలని ఆశిద్దాం. ఇలాంటి స్పందనలకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదనే ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా భారత్ చేసి తీరవలసిన పని మరొకటుంది. పాకిస్తాన్లో మరణ దండనను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్‌ను స్వదేశానికి తిరిగి రప్పించాలన్న మన డిమాండ్‌ను ఇది మరింత బలోపేతం చేయాలి. నిమిష కేసును (ఒకవేళ ఆమె శిక్షను మనం నిలువరించలేకపోతే) ఆసరాగా చేసుకుని, జాధవ్‌కు కూడా అటువంటి గతి పట్టించే సాహసం పాకిస్తాన్ అధికారులకు కలుగకుండా మనం ప్రతిఘటించి తీరాలి. ఇది చాలా ముఖ్యం. అన్నింటికన్నా మించి, అరుదైన కేసుల్లోనే విధిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ ఉరి శిక్షకు అవకాశం కల్పిస్తున్నాం. శిక్షా స్మృతికి సంబంధించి నీతి నియమాలు పరిణామం చెందుతున్న పరిస్థితులలో, ఆ రకమైన (ఉరి) శిక్ష తగినది కాదని మనం గ్రహించవలసి ఉంది.గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారతదేశ చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’
న్యూఢిల్లీ: యెమెన్‌లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష కేసు అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. నిమిష తరఫున లాయర్‌ను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. సదరు లాయర్ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ అందుబాటులో అవసరమైన సలహాలు ఇస్తున్నారన్నారు. అలాగే యెమెన్ అధికారులతో కూడా లాయర్ టచ్‌లో ఉంటూ కేసుకు సంబంధించిన విషయాల్ని చూసుకంటున్నారని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.కాగా, యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం(జూలై 16వ తేదీ) మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. -
మరణశిక్షలు న్యాయమేనా? మీకు తెలియని నిమిష ప్రియ కథ
-
కేరళ నర్స్ కేసులో బిగ్ ట్విస్ట్
-
Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ
-
నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్‌లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు. -
నిమిష ఉరిశిక్ష ఆపింది నేనే.. హౌతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలతో కేఏ పాల్
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యెమెన్, హూతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, వారిని ఒప్పించినట్టు పాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నిమిషను కాపడటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కేఏ పాల్.. మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపాను. నిమిషాను రక్షించడంలో ఎనిమిది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమైంది. మోదీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చేతులెత్తేశారు. కానీ అది అబద్ధం. హూతీ సిటీలో ప్రభుత్వం ఉంది. మోస్ట్ పాపులర్ ముస్లీం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారు.Dr. K.A Paul with Yamen leadership One of the 5 key meetings . Both sides the Houthi leaders and Government leaders have finally considering to help Indian Nurse Nimisha Priya released . The victim Talal Mahdi’s family also considering to pardon Priya the indian Nurse in Sanaa… pic.twitter.com/LSE4jH0i4M— Dr KA Paul (@KAPaulOfficial) July 14, 2025మూడు రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలను కలిశాను. వారు సాయం చేశారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా.. తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని.. తాను మళ్లీ యెమన్ లీడర్లను కలుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన వల్లే ఉరి శిక్ష ఆగిపోయిందా అని మాట్లాడుకుంటున్నారు. -
చివరి నిమిషంలో ఆగిన ఉరి.. నెక్స్ట్ ఏంటి?
-
నిమిష కేసు: భారతీయల పాలిట లైఫ్‌లైన్.. బ్లడ్‌మనీ!
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష అయితే వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్‌లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్‌మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ(క్షమాధనం) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష.. కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీతో ఆమెకు పొరపచ్చాలు వచ్చాయి. తన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. ఈ కేసులో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం.. యెమెన్‌లోని సనా సెంట్రల్ జైలులో బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో నిమిషా ప్రియకు శిక్ష అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈలోపు చర్చలకు తొలిసారి తలాల్ కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో శిక్ష వాయిదా పడింది. మరి బ్లడ్‌మనీకి ఆ కుటుంబం అంగీకరిస్తుందా?.. అసలు బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఇంతకు ముందు ఎవరైనా బయటపడ్డారా?. వర్కవుట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా?క్షమాధనం అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఇది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.నిమిష కేసులో తలాల్ అబ్దో మహ్దీ కుటుంబానికి $1 మిలియన్ రక్తపరిహారం(మన కరెన్సీలో 8 కోట్లకు పైనే) ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమ కుమారి. అయితే బ్లడ్‌మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలో వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. ఈ కారణంగానే భారత ప్రభుత్వ జోక్యం కష్టంగా మారింది. క్షమాభిక్ష కోసం మత పెద్దలు, Save Nimisha Priya Action Council ప్రయత్నాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.8.6 కోట్లు తీసుకునేందుకు యెమెన్‌లోని బాధిత కుటుంబాన్ని ఒప్పిస్తే నిమిష ప్రియకు ఊరట దక్కనుంది.వీరంతా ‘బ్లడ్ మనీ’తో బయటపడినవారే..!నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్‌మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం.. ప్రస్తుతం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది. 👉2008లో.. సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి రూ.30 లక్షల బ్లడ్‌మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లోశ్రీలంక పౌరుడ్ని చంపిన కేసులో సులేమాన్‌తో పాటు మరో ఎనిమిది మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే రూ. 40 లక్షల బ్లన్మనీతో వీళ్లంతా క్షేమంగా బయటపడ్డారు👉2012లో.. షార్జాలో పాకిస్తానీని మూకహత్య చేసిన కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్‌మనీ కింద రూ.16 కోట్లు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సాయం కూడా ఉంది. 👉2013లో.. కర్ణాటకకు చెందిన ట్రక్కు డ్రైవర్ సలీమ్ భాషాకు 2006లో సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణానికి కారణమైనందుకు గానూ ఈ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే దాదాపు రూ.1.5 కోట్ల బ్లడ్‌మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీమ్ శిక్ష నుంచి బయటపడ్డాడు.👉2014లో.. సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీ కొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్‌మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉2014లో బ్లడ్‌మనీ ఆధారంగానే ముగ్గురు భారతీయులను విడుదల చేసింది సౌదీ. మృతుడి కుటుంబానికి రూ.1.12 కోట్లు చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు.👉బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరణశిక్ష పడింది. ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ కింద 2 లక్షల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో ప్రస్తుతం దాదాపు రూ.47లక్షలు) చెల్లిస్తే క్షమిస్తామని బాధిత కుటుంబం తెలిపింది. దాతల సాయంతో ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఎనిమిదేళ్ల తర్వాత 2017లో శంకరనారాయణ యూఏఈ జైలు నుంచి విడుదలయ్యాడు.👉2017లోనే.. ఓ పాక్ పౌరుడ్ని హత్య చేసిన కేసులో 10 మంది పంజాబ్ పౌరులకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అయితే బాధిత కుటుంబానికి ₹24 లక్షల (200,000 దిర్హామ్స్) బ్లడ్‌మనీ చెల్లించడంతో క్షమాభిక్ష లభించింది. ఆపై వారు భారత్‌కు తిరిగొచ్చారు. భారత రాయబార కార్యాలయం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి బ్లడ్‌మనీ సేకరణ చేపట్టారు.👉2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత.. లింబాద్రి తరఫున రూ.1.8 కోట్లు బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు.👉2024లో.. అబ్దుల్ రహీమ్ కేసు విస్తృతంగా చర్చనీయాంశమైంది. కేరళ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీ అరేబియాకు హౌజ్ డ్రైవర్‌గా వెళ్లారు. అక్కడ తన యజమాని ఇంట దివ్యాంగుడైన అనాస్ అల్ షహ్రీ బాధ్యతలు కూడా చూసుకునేవాడు. ఈ క్రమంలో.. ఓ రోజు ప్రమాదవశాత్తూ మరణించాడు. 2018లో సౌదీ కోర్టు హత్య ఆరోపణలపై రహీమ్‌కు మరణశిక్ష విధించింది. 2022లో అక్కడి సుప్రీం కోర్టు కూడా శిక్షను సమర్థించింది. ఈ క్రమంలో బ్లడ్‌మనీ తెర మీదకు వచ్చింది. బాధిత కుటుంబం ₹34 కోట్లు (15 మిలియన్ సౌదీ రియాల్స్) బ్లడ్‌మనీ తీసుకుంటే క్షమించేందుకు సిద్ధమని తెలిపింది. ఆరు నెలల్లో మొత్తం చెల్లించేలా 2023 అక్టోబర్ 16న ఒప్పందం కుదిరింది. SAVEABDULRAHIM' యాప్ ద్వారా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు. అలా.. 2024 జూలై 2న రియాద్ క్రిమినల్ కోర్టు ఆదేశాలతో శిక్ష రద్దు అయ్యింది. బ్లడ్‌మనీ చెక్కును బాధిత కుటుంబానికి అప్పగించారు. అయితే.. ఈ ఏడాదిలోనే రహీమ్ విడుదల కావాల్సి ఉంది. ఈ ఘటన.. మానవత్వం, భారతీయుల ఐక్యత, న్యాయం కోసం పోరాటం చూపిన ఉదాహరణగా నిలిచింది.👉2019లో.. అర్జునన్ అతిముత్తు, తమిళనాడులోని తంజావూరు జిల్లా, అతివెట్టి గ్రామంకు చెందిన వ్యక్తి. ఆయన 2013లో కువైట్‌లో తన రూమ్మేట్ అబ్దుల్ వాజిద్ (మలప్పురం, కేరళ)ను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురయ్యారు. 2016లో శిక్ష ఖరారు అయ్యింది. అయితే బ్లడ్‌మనీ ఒప్పందం కింద.. బాధిత కుటుంబం ₹30 లక్షలు తీసుకుని క్షమాభిక్ష ఇచ్చేందుకు అంగీకరించింది. ఆపై కువైట్ ప్రభుత్వం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అప్పటి కోటక్కల్ MLA అబిద్ హుస్సేన్, యూత్ లీగ్ నేతలు కలిసి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా మొత్తం సేకరించారు.కాగా.. ఈ బ్లడ్ మనీతో భారతీయులకు కూడా పరిహారం దక్కిన సందర్భం ఉంది. 2019 దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో భారత్‌కు చెందిన మహ్మద్ మీర్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్.. బ్లడ్ మనీ కింద మీర్జా కుటుంబానికి 5 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో అప్పటికి దాదాపు రూ.11కోట్లు) చెల్లించాడు.బ్లడ్‌మనీ తప్పించలేకపోయింది!సౌదీ పౌరుడ్ని హత్య చేసిన కేఏసులో ధరమ్‌పాల్ సింగ్(2020)ను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్లడ్‌మనీని బాధిత కుటంబం తిరస్కరించడంతో మరణశిక్ష అమలు చేశారు.తన యాజమానిని హత్య చేసిన కేసులో కే మాధవన్‌కు సౌదీలో మరణశిక్ష పడింది. అయితే కుటంబం బ్లడ్‌మనీని సేకరించడంలో విఫలమైంది. దీంతో 2004లో మరణశిక్ష అమలు చేశారు.సహోద్యోగిని హత్య చేసిన కేసులో.. షంసుద్దీన్కి మరణశిక్ష పడింది. అయితే బ్లడ్‌మనీని బాధిత కుటుంబం తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలైంది.పెండింగ్‌లో..ఓ దాడి కేసులో యూఏఈలో యూనస్ అనే భారతీయడికి మరణశిక్షపడింది. ఫ్యామిలీ బ్లడ్‌మనీ సేకరించడంలో ఇబ్బంది పడుతోంది. అయితే శిక్ష ఇంకా అమలు కాలేదు.నిమిష ప్రియ కేసులో.. గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్‌మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్ల (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు చర్చల వేళ.. శిక్ష తప్పుతుందో..? లేదో అనే ఉత్కంఠ నెలకొంది. -
నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్‌తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. -
సుప్రీంలో నిమిషా కేసు.. అద్భుతం జరుగుతుందా?
-
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం చేతులెత్తేసింది. యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఆమె మరణ శిక్ష అమలు కానుంది. అయితే కేంద్రం తక్షణ జోక్యం చేసుకుని.. నిమిష శిక్షను తప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఈ కేసులో ఎలా ఆర్డర్ పాస్ చేయాలి, ఎవరు ఫాలో అవుతారని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆరా తీసింది. అయితే తాము (కేంద్రం) చేయగలిగినదంతా చేశామని, యెమెన్‌తో భారత్‌కు సత్సంబంధాలు అంతగా లేవని, అయినా కూడా అక్కడి ప్రాసిక్యూటర్‌కు మరణశిక్షను వాయిదా వేయాలని రాశామని, బ్లడ్‌మనీ చివరి అవకాశమని, ఆ చర్చలంతా ప్రైవేట్ వ్యవహారమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదని, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నామని అటార్నీ జనరల్ వెంకటరమణి ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ప్రాణాలు పోతే గనుక చాలా బాధాకరమని అన్నారాయన. అయితే అనధికారిక మార్గాలు ఏమైనా ఉన్నాయో పరిశీలన చేసి వెంటనే సంప్రదించాలని ఆయన ఏజీకి సూచిస్తూ.. ఈ పిటిషన్లో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. యెమెన్‌లో ఓ వ్యక్తిని చంపిన కేసులో నిమిషా ప్రియాకు 2017లో మరణశిక్ష పడింది. యెమెన్‌లో తాను తీవ్ర చిత్రహింసలకు గురయ్యానని, తన వ్యాపార భాగస్వామి(బాధితుడి) తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు అతనికి మత్తు మందు ఇచ్చానని నిమిష చెబుతోంది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను మరణించాడని తేలింది. ఈ కేసులో చివరగా మిగిలిన ఆశ బ్లడ్‌మనీ ఒక్కటే. షరీయత్ చట్టం ప్రకారం ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే.. బాధితుడి కుటుంబానికి $1 మిలియన్ (రూ. 8.3 కోట్లు) చెల్లించేందుకు నిమిష కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
తెలుగులో 'మై బేబీ' రిలీజ్‌కి రెడీ
తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్ఏ' సినిమాని తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా.. ఈనెల 18న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్, పిజ్జా లాంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి.. ఈ 'మై బేబి'ని తెలుగులో విడుదల చేస్తున్నారు.అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు. 2014లో ఓ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. -
నిమిష ప్రియ కేసుపై నమోదైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం అంగీకారం
-
నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా?
సనా: అరబ్ దేశం యెమెన్‌లో మాజీ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఆమెకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్‌మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు. మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తశ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి బయటపడి ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సుకు ఎందుకు ఉరిశిక్ష? కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్ ఏర్పాటు చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్‌లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్ రాజధాని సనా సిటీలోని సెంట్రల్ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సైతం 2023 నవంబర్‌లో ట్రయల్ కోర్టు తీర్పును సమరి్థంచింది. హౌతీ తిరుగుబాలుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి. శిక్ష తప్పే మార్గం ఉందా? బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్‌మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్‌మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు. మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ బుధవారం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆ«దీనంలో ఉంది. వీరికి ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్‌లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్‌లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్‌తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్‌లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్‌లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్‌నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డ్‌లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా?
నిమిషా సజయన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నల్లకలువ తెలుగు వారందరికి కూడా పరిచయమే. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన కళ్లు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా తన మూలాలు మాత్రం మలయాళంలోనే ఉన్నాయి. తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్ వారికి బాగా దగ్గరైంది.తాజాగా ఈ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ చేపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. నటి నిమిషా సజయన్ ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ చర్చల అంశం మలయాళ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన క్షణం నుంచి ప్రస్తుతం ఆమె ముఖం కొద్దిగా మారిపోయిందని వారు అంటున్నారు. దీనిపై కాస్మోటాలజిస్టుల అభిప్రాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ శిఖా, తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాన్ని కూడా పంచుకున్నారు.నిమిషా సజయన్ మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ బరువు తగ్గిందని ఆమె తెలిపింది. రింగులుగా ఉన్న ఆమె జుట్టు స్ట్రెయిట్ చేయబడింది. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదు. తన మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని తాను అనుకుంటున్నట్లు డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన అందానికి ఫిదా అయిన చాలామంది నిమిషా సోషల్‌మీడియా ఖాతా కామెంట్ బాక్స్‌లో ప్రశంసిస్తున్నారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని పలువురు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది.మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె పబ్లిక్ ఫోరంలోనే కామెంట్ చేసింది. అయితే, తాజాగా సురేష్ గోపీ విజయం సాధించారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) -
ఇండియాలో టాప్ వన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్..
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా మారి విజయాన్ని అందుకున్నారు.ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి ఆమె 'పోచర్' అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కుతుంది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పూజలు.. కారణం ఇదేనా..?) తాజాగా పోచర్ సిరీస్ గురించి అలియాభట్ ఇలా తెలిపింది. ఈ వెబ్ సిరీస్ గురించి మంచి రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. తన ఇంట్లోని టీవీ ముందు నిలబడి పెంపుడు పిల్లితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. వెబ్ సిరీస్ విడుదలైన రోజునే భారతదేశంలో నంబర్ వన్‌గా నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం కూడా పోచర్ వెబ్ సిరీస్ టాప్‌లో ఉంది. సిరీస్ చూడని వారు త్వరగా చూడాలని ఆమె కోరింది. ఇందులో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్రు భట్టాచార్య ప్రధాన పాత్రలలో కనిపించారు. కథ ఏంటి..? ఈ కథ 2015 నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. నిమిషా సజయన్ (మాల) తండ్రి చేసిన పాపానికి పరిహారంగా అడవిలోని వన్య మృగాలను రక్షించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఏనుగు దంతాల కోసం 18 ఏనుగులను చంపేశారనే వార్త బయటకి రావడంతో 'మాల' నివ్వెరపోతుంది. ఏనుగులను ఎవరు చంపుతున్నారు..? ఏనుగు దంతాల రవాణా ఎక్కడి నుంచి సాగుతోంది..? అవి ఎక్కడికి చేరుకుంటున్నాయి..? మొత్తం ఈ నెట్ వర్క్ వెనుక ఉండి నడిపిస్తున్నదెవరు..? అనేది తెలుసుకోవడం కోసం ఒక టీమ్ బరిలోకి దిగుతుంది. అందులో మాల కూడా భాగం అవుతుంది. ఈ కేసులో ముందుకు వెళుతున్న కొద్దీ వాళ్లకి తెలిసే నిజాలు ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.. కథను నిదానంగా చెప్పడం వల్ల నిడివి పెరిగిపోయింది. స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలు .. ఇన్వెస్టిగేషన్లో వేగం తగ్గడం.. కథలో పెద్దగా లేని ట్విస్టులు .. ప్రధాన మైనస్‌గా ఉన్నాయి. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
'అందంగా లేని హీరోయిన్ను తీసుకున్నారు'.. దర్శకుడి సమాధానమిదే!
రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. నవంబర్ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు. అలా అనడం చాలా తప్పు ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్లోనూ భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఏమీ మారలేదు 'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్‌కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఘనాపాటి కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, తొండిముతలుమ్ దృక్షాక్షియుమ్.. తదితర హిట్ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో రాఘవ లారెన్స్ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది. I was there. It was not just about the ridiculous ‘beauty’ question for the reporter. There was a conscious effort from the guy to ask something controversial and he was so proud after asking this. Nothing has changed since the appalling ‘Jigarthanda’ - ‘Figuredhanda’ question 9… https://t.co/ZaVh5lEkK9 — Santhosh Narayanan (@Music_Santhosh) November 18, 2023 చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు.. -
చాలా ఎమోషనల్‌గా సాగిన సిద్ధార్థ్ 'చిన్నా' ట్రైలర్
సిద్ధార్థ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘చిన్నా’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ సినిమా తమిళనాట సెప్టెంబర్ 28న విడుదలైంది. కోలీవుడ్‌లో 'చిత్త' పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాపై తమిళపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా విమర్శకులు సైతం ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఒకరకంగా సిద్ధార్థ్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా వారందరూ చెప్పుకొస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని కమల్ హాసన్ తెలిపారు. ఈ సినిమా చూసిన అనంతరం చాలా ఎమోషన్‌కు గురైయానని ఆయన చెప్పారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం,వెట్రిమారన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ సినిమా చూసి మేకర్స్‌ను అభినందించారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లిన అజిత్..) ఈ చిత్రం అక్టోబర్ 6న 'చిన్నా'గా తెలుగులోకి రాబోతోంది. దీనిని ఏషియన్ మూవీస్ వారు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీనిని చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సిద్ధార్థ్ ఇప్పటి వరకు చేయని డీగ్లామర్ రోల్ కనిపించారు. ఆయనకు జోడీగా మలయాళ టాలెంటెడ్ నటి అయిన నిమిషా సజయన్ నటించింది. -
నవ కళా ఉద్యమం
ప్రపంచంలోని ఎన్నో సామాజిక ఉద్యమాల్లో ‘కళ’ బలమైన పాత్ర నిర్వహించింది. ‘కత్తి కంటే కళ గొప్పది’ అని ఢంకా బజాయించి చెప్పింది. నిరూపించింది. కొన్ని నెలల క్రితం కేరళలో వరకట్న హత్యలు కలకలం సృష్టించాయి. ‘ఎందుకు ఇలా జరుగుతుంది?’ అంటూ చర్చ మొదలైంది. ‘అక్షరాస్యతకు పేరుగాంచిన ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏమిటి!’ అనే ఆవేదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో వరకట్నహింసతో పాటు స్త్రీలపై జరిగే రకరకాల హింసలకు వ్యతిరేకంగా కేరళలో ‘స్త్రీ నవకేరళం’ పేరుతో కళాఉద్యమం మొదలుకానుంది. పాటలు, నాటికలు, స్ట్రీట్ప్లే, చిత్రాలు, కార్టూన్లు, గోడపత్రికలు, సోషల్ మీడియా చాలెంజ్, వీడియోలు రూపొందించడం... మొదలైన వాటిలో వివిధ జిల్లాలో నుంచి ముగ్గురు మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఈ ముగ్గురు తమ జిల్లాలలోని పదిమంది బృందానికి శిక్షణ ఇస్తారు. ఈ కళాఉద్యమానికి సంబంధించి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం అయింది. కళాబృందాలు జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లెల వరకు అన్ని ప్రాంతాలకు వెళ్లి తమ కళారూపాలను ప్రదర్శిస్తాయి. దీంతో పాటు గ్రామ ప్రజలతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. ‘ఫలాన గ్రామంలో వరకట్న వేధింపులు భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్మ చేసుకుంది...’ అని కళాబృందంలోని ప్రధాన వక్త చర్చ ప్రారంభిస్తుంది. ‘ఇది అన్యాయం... అలా జరగడానికి వీల్లేదు’ అంటాడు ఒక పెద్దాయన. ఆయనతో గొంతు కలుపుతాడు ఒక నవయువకుడు. ఆ వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. అది భవిష్యత్‌కు ఆశావహమైన మార్పు కావచ్చు. ఈ కళా ఉద్యమానికి అంబాసిడర్‌గా నటి నిమిష సజయ ఎంపిక అయ్యింది. ‘ఉద్యోగాలలో లింగవివక్షతను ప్రశ్నించే కళారూపాలు, స్త్రీసాధికారతకు సంబంధించిన కళారూపాలు కూడా మా ప్రచారయాత్రలో చోటుచేసుకుంటాయి’ అంటుంది నిమిష సజయ. -
'నా కూతురికి అబార్షన్ చేయించాడు'
తిరువనంతపురం: మాజీ ప్రేమికుడు బలవంతం చేయడంతోనే తన కుమార్తె మతం మారిందని ఫాతిమా అలియాస్ నిమిషా తల్లి బిందు ఆరోపించారు. సయిద్ రెహ్మాన్ తన కూతుర్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని పేర్కొన్నారు. కేరళ నుంచి ఐసిస్ చేరడానికి వెళ్లారని భావిస్తున్న వారిలో ఫాతిమా కూడా ఉంది. తన భర్త ఎజా అలియాస్ బెక్స్టన్ తో కలిసి ఆమె కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు బుధవారం మీడియా ముందుకు వచ్చారు. పుదుచ్చేరి మెడికల్ కాలేజీ విద్యార్థి అయిన రెహ్మాన్... నిమిషాను ప్రేమలోకి దించాడని బిందు తెలిపారు. 2013లో నిమిషాను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని, ఆమెకు గర్భస్రావం చేయించాడని ఆరోపించారు. రెహ్మాన్ తో విడిపోయిన తర్వాత కూడా ఆమె ముస్లింగానే కొనసాగిందని వెల్లడించారు. రెహ్మాన్ తో సంబంధం గురించి తమకు ఎప్పుడు చెప్పలేదని, అతడి ద్వారానే ఈ విషయాలు తెలిశాయన్నారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు హిందువుగానే ఉండేదన్నారు. నిమిషాను కలవడానికి పలుమార్లు కలవడానికి రెహ్మాన్ ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదన్నారు. 'నా కుమార్తె కనిపించకుండా పోవడానికి కారణం అతడే. ఆమె ఎక్కడ ఉందో తెలియడం లేదు. నిమిషా అదృశ్యమైన విషయం తెలిసి రెహ్మాన్ నన్ను సంప్రదించాడు. తనను క్షమించాలని కోరాడు. నిమిషా లాగే ఇద్దరుముగ్గురు యువతులు కనిపించకుండా పోయారని చెప్పాడ'ని బిందు తెలిపారు. -
ప్రేమికురాలి ప్రాణం తీసిన 'సంప్రదాయం'
బెంగళూరు : వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను సంప్రదించారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. అయితే ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలన్న విషయంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం విషయంలో ఎంతకూ ఇరు కుటుంబ సభ్యులు రాజీకాలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమికురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వర్తూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన నిమిషా (28) స్థానిక కుందనహళ్లిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ)లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ మారతహళ్లి సమీపంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వివాహానికి ఇరు కుటుం బాల పెద్దలూ అంగీకరించారు. అయితే పెళ్లి తెలుగు సంప్రదాయంలో చేయాలని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు.. కాదు, కాదు బీహార్ సంప్రదాయంలోనే జరగాలని నిమిషా కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల వారు పట్టువీడకపోవడంతో సమస్య జఠిలమైంది. ఆఖరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిమిషా జీవితంపై విరక్తి చెందింది. బుధవారం రాత్రి తన చిన్నాన్న రంజిత్‌కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. సుమారు 15 నిమిషాల పాటు తన గోడును వెళ్లబోసుకుంది. కొద్దిసేపు తర్వాత రంజిత్‌కు అనుమానం వచ్చి నిమిషాకు ఫోన్ చేశాడు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించాడు. గురువారం మళ్లీ నిమిషాకు రంజిత్ ఫోన్ చేశాడు. అప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను నిమిషా ఉంటున్న హాస్టల్‌కు రావడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.