
యెమెన్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవన్మరణ పోరాటం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు క్రితం ఆమెకు పడాల్సిన ఉరిశిక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిమిష.
బ్లడ్‌మనీ(క్షమాధనం లేక నష్టపరిహారం) ఇచ్చేందుకు కూడా సిద్ధమైన తరుణంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే బాధిత తలాల్ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం తమకు బ్లడ్‌మనీ వద్దని ఇప్పటికే తెగేసి చెప్పింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దాంతో నిమిష ఉరిశిక్ష రద్దు అనేది పక్కకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా నిమిష కూతరు 13 ఏళ్ల మిషెల్ తన తల్లియందు దయ చూపించాలని యెమెన్ అధికారుల్ని వేడుకోంటుంది. ఈ మేరకు మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో తల్లిని రక్షించాలంటూ ప్రాధేయపడుతోంది.
‘ఐ లవ్ యూ మమ్మీ. ఐ మిస్ యూ. మా అమ్మను తిరిగి వెనక్కి పంపడానికి సాయం చేయండి. మా అమ్మ పట్ల దయ చూపండి. తలాల్ కుటుంబానికి థాంక్స్ చెప్పేందుకు మిషెల్ ఇక్కడ ఉంది. మీరు మా అమ్మపై కరుణ చూపి అక్కడ నుంచి విడుదలకు మార్గం చూపండి.
రేపు, రేపు మరుసటి రోజు మీ పట్ల మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని వేడుకుంటోంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌తో కలిసి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్‌లో తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎ పాల్‌తో కలిసి నిమిష కూతురు మిషెల్ మీడియాతో మాట్లాడింది.