breaking news
yeman
-
నిమిష ఉరిశిక్ష ఆపింది నేనే.. హౌతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలతో కేఏ పాల్
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యెమెన్, హూతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, వారిని ఒప్పించినట్టు పాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నిమిషను కాపడటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కేఏ పాల్.. మూడు రోజులు రాత్రింభవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపాను. నిమిషాను రక్షించడంలో ఎనిమిది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమైంది. మోదీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చేతులెత్తేశారు. కానీ అది అబద్ధం. హూతీ సిటీలో ప్రభుత్వం ఉంది. మోస్ట్ పాపులర్ ముస్లీం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారు.Dr. K.A Paul with Yamen leadership One of the 5 key meetings . Both sides the Houthi leaders and Government leaders have finally considering to help Indian Nurse Nimisha Priya released . The victim Talal Mahdi’s family also considering to pardon Priya the indian Nurse in Sanaa… pic.twitter.com/LSE4jH0i4M— Dr KA Paul (@KAPaulOfficial) July 14, 2025మూడు రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలను కలిశాను. వారు సాయం చేశారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా.. తనను ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని.. తాను మళ్లీ యెమన్ లీడర్లను కలుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన వల్లే ఉరి శిక్ష ఆగిపోయిందా అని మాట్లాడుకుంటున్నారు. -
ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలోని యెమన్ హౌతీ రెబల్స్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్ 18 డ్రోన్ దాడులకు తెగపడిందని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ నివేదికలో పేర్కొంది. మొత్తంగా గడిచిన ఏడు వారాల్లో హౌతీ రెబల్స్ సాయుధు దళాలు ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ వాణిజ్య చానెల్స్‌పై మొత్తం 26 సార్లు దాడులకు పాల్పడినట్లు తెలిపింది. అదేవిధంగా రెండు యాంటి షిప్ క్రూయిస్ మిసైల్స్, ఒక యాంటి బాలిస్టిక్ మిసైల్‌ను కూడా హౌతీ సాయుధ దళాలు ప్రయోగించినట్లు సీఈఎన్‌టీసీఓఎం వెల్లడించింది. సీఈఎన్‌టీసీఓఎం అనేది యూకే దేశ సహకారంతో నడిచే అమెరికా ఫోర్స్. ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించే హౌతీ రెబల్స్ ఇరాన్లో తయారైన మానవ రహిత ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)తో పాటు యాంటి షిప్ క్రూయిజ్ మిసైల్స్, యాంటి షిప్ బాలిస్టిక్ మిసైల్స్‌తో దక్షిణ ఎర్ర సముద్రంలో దాడులు చేసిందని బుధవారం సీఈఎన్‌టీసీఓఎం ప్రకటించింది. ఎర్ర సముద్రంలోని పలు షిప్పింగ్ చానెల్స్‌పై హౌతీ రెబల్స్ దళాలు ఇప్పటివరకు మొత్తంగా 26 దాడులు చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ భాగస్వామ్య హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో అలజడి సృష్టిస్తూ.. డ్రోన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గాజాపై తీవ్రంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌పై ప్రతీకారంగానే ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు ఆపేవరకు తమ దాడులు కొనసాగిస్తామని హౌతీ రెబల్స్ హెచ్చరిస్తోంది. యెమన్ హౌతీ రెబల్స్ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై కూడా డ్రోన్, మిసైల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే హమాస్ దళాలు అక్టోబర్ 7 చేసిన మెరుపు దాడలకు ప్రతిగా ఇజ్రాయెల్.. గాజాపై దాడులతో విరుచుకుపడుతోంది. గాజాలో హమాస్ సాయుధులను అంతం చేసేంతవరకు తమ దాడులు కొనసాగిస్తాని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రిపబ్లికన్ అభ్యర్థులకు మంచు టెన్షన్ -
కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..?
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. బిచ్చగాడు తరువాత వచ్చిన భేతాళుడు కూడా మంచి వసూళ్లు సాధించటంతో విజయ్ చేస్తున్న కొత్త సినిమాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన విజయ్ ఆంటోని ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. 2.0, శభాష్ నాయుడు, ఖైదీ నంబర్ 150 లాంటి భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. తమిళ్లో యెమన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో యముడు అనే టైటిల్‌తో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అదే టైటిల్‌తో సూర్య హీరోగా ఓ సినిమా రిలీజ్ అయినందున ఆ పేరుకు ముందో వెనకో మరో పదాన్ని కలిపి టైటిల్‌గా నిర్ణయించాలని భావిస్తున్నారట. సూర్య యముడు సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఎస్ 3 కూడా త్వరలో రిలీజ్ అవుతున్న నేపథ్యం విజయ్ ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.