
ఒట్టావా: కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, పలు హత్యలకు పాల్పడుతున్నదని కెనడియన్ నేత డేనియల్ స్మిత్ పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ నేర నెట్‌వర్క్ కలిగివున్నదని, అందుకే ఈ గ్యాంగ్‌కు టెర్రర్ ట్యాగ్ ఇవ్వాలని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైనదని, హింసాత్మకమైనదని స్మిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎటువంటి హద్దులు లేవని, దీనికి దేశంలో స్థానం ఉండకూడదని అన్నారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించడం ద్వారా, దాని ఆటలు ఇకపై సాగవని , ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడదని స్మిత్ పేర్కొన్నారు. కాగా బిష్ణోయ్ నెట్‌వర్క్‌లో కీలకంగా భావిస్తున్న గోల్డీ బ్రార్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటినుంచో కెనడాను కోరుతూ వస్తోంది.
The Lawrence Bishnoi Gang is a transnational criminal network responsible for violence, extortion, drug trafficking and targeted killings, including here in Canada. Its reach is global, and its intent is criminal and violent.
We know that gang activity knows no boundaries and… pic.twitter.com/wYwdAx3pfT— Danielle Smith (@ABDanielleSmith) July 15, 2025
గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియా నేత డేవిడ్ ఎబీ కెనడాకు ఇదేవిధమైన అభ్యర్థన చేశారు. ఈ ముఠా అల్బెర్టా, ఒంటారియో ప్రాంతంలోని దక్షిణాసియా ప్రజలపై పలు నేరాలకు పాల్పడిందని డేవిడ్ ఎబీ ఆరోపించారు. ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ ఈ పిలుపుకు మద్దతునిచ్చారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడియన్ చట్ట అమలు సంస్థలకు వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లతో పోరాడేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.