Whatsapp Bans Over 66 Lakh Bad Accounts in India in June - Sakshi
Sakshi News home page

WhatsApp: 66 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌.. కారణం ఇదే...

Aug 3 2023 6:22 PM | Updated on Aug 3 2023 6:49 PM

WhatsApp Bans Over 66 Lakh Accounts In India why - Sakshi

మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్‌ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు జూన్‌ నెలలో 7,893 ఫిర్యాదులు అందగా వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్‌లకు పైగా యూజర్లు ఉన్నారు. యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌లో నమోదైన ఫిర్యాదులకు అనుగుణంగా కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకోగా నిబంధనలు అతిక్రమించిన మరికొన్ని అకౌంట్లపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు వాట్సాప్‌ పేర్కొంది. చర్యల నిమిత్తం గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement