యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం! | Government-Could-Earn-84000 Crore Every Year Imposing 0.4 Percent Charge-UPI-Above-2000rs | Sakshi
Sakshi News home page

యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!

Sep 16 2026 12:08 AM | Updated on Sep 16 2026 12:12 AM

Government-Could-Earn-84000 Crore Every Year Imposing 0.4 Percent Charge-UPI-Above-2000rs

Photo Credit: Twitter

భారత్‌లో ఏడాదికి యూపీఐ (UPI) మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ. 314 లక్షల కోట్లు అని అంచనా. తాజాగా 2వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన పీ2ఎమ్ (పర్సన్ టూ మర్చంట్‌) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ (మర్చంట్ రేట్ డిస్కౌంట్‌) వర్తిస్తుంది. అయితే భారత్‌లో ఏడాదికి రూ. 2 వేల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీల మొత్తం విలువ రూ. 210 లక్షల కోట్ల పైమాటే. 

ఈ లెక్కన రూ. 210 లక్షల కోట్లు x 0.4 శాతంతో లెక్కిస్తే ఏడాదికి రూ. 84వేల కోట్లు. అందుకే కేంద్ర ప్రభుత్వం యూపీఐ ద్వారా 2వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే పీ2ఎమ్‌పై 0.4 శాతం విధించడం ద్వారా వచ్చే 84 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం కిందే లెక్క అని చెప్పవచ్చు.

ఇక యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును (MDR) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖరారు చేసింది. రూ.2వేలు పైబడి వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.

సాధారణ వినియోగదారులు ఎప్పటిలాగే యూపీఐ లావాదేవీలను ఉచితంగానే కొనసాగించవచ్చని పేర్కొంది. అలాగే, వ్యక్తుల మధ్య జరిగే నగదు లావాదేవీలు (P2P), రూ. 2వేలలోపు వ్యాపార చెల్లింపులు (P2M) ఎండీఆర్ పరిధిలోకి రావని స్పష్టంచేసింది.

ఇదీ చదవండి: శాంసన్‌ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement