యూపీఐ (UPI) ద్వారా డబ్బు పంపే వ్యక్తులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. అయితే, వ్యాపారులకు చేసే కొన్ని చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీ వర్తిస్తుందని చెబుతున్నారు. అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డబ్బు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉదాహరణకు మీరు మీ స్నేహితుడికి రూ.500, కుటుంబ సభ్యుడికి రూ.5,000 లేదా మరొక వ్యక్తికి రూ.1 లక్ష యూపీఐ ద్వారా పంపినా, P2P లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు. అంటే లావాదేవీ విలువ ఎంత ఉన్నా వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులు ఉచితంగానే ఉంటాయి.
అయితే.. పర్సన్ టు మర్చెంట్ (P2M) విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక వ్యాపారి లేదా సంస్థకు యూపీఐ ద్వారా చెల్లించడం. ఉదాహరణకు మీరు ఒక షాపులో రూ.5,000 విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే అది P2M లావాదేవీ అవుతుంది. అప్పుడు ప్రకటన ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన P2M లావాదేవీలపై 0.4 శాతం MDR చెల్లించాల్సి ఉంటుంది.
అదే విధంగా రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అధిక మొత్తపు లావాదేవీలపై MDR గరిష్ఠంగా రూ.300గా పరిమితం చేయనున్నట్లు సమాచారం. ఉదాహరణకు రూ.1 లక్ష P2M లావాదేవీకి 0.4% ప్రకారం రూ.400 రావాల్సి ఉన్నప్పటికీ, క్యాప్ కారణంగా MDR రూ.300కు పరిమితం అవుతుంది.
మొత్తం మీద.. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ లేదు. కానీ వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై 0.4 శాతం MDR వర్తిస్తుంది, అలాగే రూ.75,000 పైబడిన అధిక విలువైన లావాదేవీలకు MDR గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుంది.
Ministry of Finance says, "UPI Payments to Remain Free for Person to Person transactions; MDR Applicable Only on Large-Value Merchant Transactions
No charges on person-to-person (P2P) transaction, irrespective of transaction value
Nominal MDR of 0.4% to be levied on P2M… pic.twitter.com/0ecfJVcX7Q— ANI (@ANI) September 15, 2026


