హైదరాబాద్: మొబైల్, ఎల్రక్టానిక్స్ రిటైల్ సంస్థ ‘బీ న్యూ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్’ తన 12వ వార్షికోత్సవం సందర్భంగా ‘యానివర్సరీ సేల్’ ప్రకటించింది. ఇందులో భాగంగా మొబైల్స్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, మొబైల్ యాక్సెసరీస్, ఆడియో ఉత్పత్తులు, హోమ్ ఆప్లయెన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫైనాన్స్ ప్రయోజనాలు అందించనుంది. మొబైల్ యాక్సెసరీస్‌పై 80%, హోమ్ అప్లయెన్సెస్‌పై 60% డిస్కౌంటు ఇస్తుంది.
ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ.12,000 వరకు ప్రత్యేక తగ్గింపు అందిస్తుంది. ల్యాప్‌ట్యాప్‌లు ప్రారంభ ధరతో రూ.17,999 అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.14,000 వరకు తక్షణ డిస్కౌంటు పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఫైనాన్స్ సదుపాయం ఉంది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ వై.డీ. బాలాజీ చౌదరీ మాట్లాడుతూ... వినియోగదారులు చూపిన నమ్మకమే ‘బీన్యూ’ 12 ఏళ్ల నిరంతర ప్రయాణానికి, వృద్ధికి ప్రధాన కారణమన్నారు. సరికొత్త టెక్నాలజీని సరైన ధరకు, ఉత్తమ సేవలతో అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించి కస్టమర్లకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.


