సాఫ్ట్‌వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..

Meta Engineer Quit Rs 3 Crore Job After Panic Attacks - Sakshi

ఆధునిక కాలంలో చాలామంది గూగుల్, మెటా వంటి బడా కంపెనీలలో ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఒక ఉద్యోగి మాత్రం కొన్ని కారణాల వల్ల కోట్లు వేతనం వచ్చే మెటా సంస్థలో ఉద్యోగాన్ని వదిలేసినట్లు సమాచారం. దీనికి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాలో ఏడాదికి రూ. 3 కోట్లు వేతనాన్ని పొందే 28 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి 'ఎరిక్ యు' (Eric You) వర్క్ తరువాత కూడా అదే ఆలోచనలతో ఉండటం వల్ల పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీంతో జాబ్ వదిలేయాల్సి వచ్చినట్లు తెలిపాడు.

నిజానికి వర్క్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కానీ ఆ పని ఒత్తిడి అలాగే ఉండేది. వీకెండ్ సమయంలో పని చేసినా కూడా బాస్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వల్ల ఆఫీసులోనే మొదటి సారి పానిక్ అటాక్ వచ్చినట్లు తెలిపాడు.

ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?

2019 నవంబర్ సమయంలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్ వచ్చిందని, ఆ తరువాత పలుమార్లు ఈ అటాక్ వెంటాడుతూనే ఉండటం వల్ల జాబ్ వదిలి, రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top