‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్‌ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్‌ కంపెనీల వార్నింగ్‌

Top It Company Warns Employees Against Work From Home - Sakshi

ఆర్ధిక మాంద్యం భ‌యాలు వెంటాడ‌టంతో ప‌లు టెక్ కంపెనీలు వ్య‌య నియంత్ర‌ణ పేరుతో మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డుతున్నాయి. కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులకు వర్క్ ​ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐబీఎం ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ రిమోట్‌ వర్క్‌ (వర్క్‌ ఫ్రమ్‌ హోం) ఉద్యోగుల భవిష్యత్‌కు ప్రమాదకరమని అన్నారు. 

సీఈవో అరవింద్‌ కృష్ణ వ్యాఖ్యలపై ఆ సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ స్పందించారు. ఉద్యోగులు ఆఫీస్‌ రావాలని తాము పిలవలేదని, రిమోట్‌ వర్క్‌ వారి కెరియర్‌ను మరింత కఠినతరం చేస్తుందని మాత్రమే అన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా మేనేజర్‌ స్థాయి ఉద్యోగులపై వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్రతికూల ప్రభావం చూపుతుందని సూచించారు. 

‘మీరు రిమోట్‌ వర్క్‌ చేస్తే మేనేజర్‌ బాధ్యతలకు న్యాయం చేయలేరు. ఎందుకంటే మీరు వ్యక్తులను మేనేజ్‌ చేయోచ్చు. కానీ సిబ్బంది ఏం వర్క్‌ చేస్తున్నారో చూడాలి. కానీ అది అసాధ్యం కాదు. ఉద్యోగులు వారు ఏం వర్క్‌ చేస్తున్నారో పర్యవేక్షించాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారు.

చదవండి👉 వరల్డ్‌ వైడ్‌గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా?

ప్రతి నిమిషం ఉద్యోగులు ఏం చేస్తున్నారో చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ‘అందరూ నేను చెప్పినట్లే చేయాలి. నా కిందే మీరంతా’ అనే ఈ తరహా నియమాల కింద పనిచేయాల్సిన అవసరం లేదని అరవింద్‌ కృష్ణ అన్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఇలా ఉద్యోగులు వర్క్‌ ఫ‍్రమ్‌ హోంకు స్వస్తిపలికి ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చిన టెక్‌ కంపెనీల్లో ఐబీఏం మాత్రమే కాదు. గతంలో మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. 

వ్యక్తిగతంగా తమ సహోద్యోగులతో కలిసి పని చేయడానికి మరిన్ని అవకాశాలను గుర్తించాలే ప్రోత్సహించాలి. ఇంట్లో ఉండి పనిచేసే వారికంటే ఆఫీస్‌కి (మెటా) వచ్చి పనిచేస్తున్న వారే మెరుగైన పనితీరును కనబరుస్తున్నారు. ఇదే అంశం కంపెనీ పనితీరుపై తయారు చేసిన డేటా చూపిస్తోందని జుకర్‌బర్గ్ నొక్కిచెప్పారు. సంస్థలోని ఇంజనీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచర ఉద్యోగులతో కలిసి పనిచేనప్పుడు సగటున మెరుగైన పనితీరు కనబరుస్తారని కూడా ఈ విశ్లేషణ చూపిస్తుందని’ జుకర్‌ బర్గ్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ప్రస్తావించారు.

చదవండి👉 ట్విటర్‌లో మస్క్‌ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top