అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్‌.. వీడియో వైరల్‌ | Narne Nithin Received Blessings From Lakshmi Pranathi And Jr NTR, Wedding Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్‌.. వీడియో వైరల్‌

Oct 11 2025 10:17 AM | Updated on Oct 11 2025 10:32 AM

Narne nithin couple blessing receive his sister and jr ntr

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది, యంగ్‌ హీరో నార్నె నితిన్‌ వివాహం ఘనంగా జరిగింది.  హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో శంకర్‌పల్లిలో ఈ  వివాహ వేడుక జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె శివానీతో కలిసి నితిన్‌ ఏడడుగులు వేశారు.  శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే,  ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు అక్కడ ప్రధాన  ఆకర్షణగా నిలిచారు. కల్యాణ్‌ రామ్‌, రానా వంటి స్టార్‌ హీరోలు కూడా పెళ్లిలో సందడి చేశారు.

కొత్త దంపతులను ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతి ఆశీర్వదించారు. ఆ సమయంలో నితిన్‌ తన బావ ఎన్టీఆర్‌ కాళ్లకు నమస్కారం చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆపై తారక్‌ కూడా వారిద్దరినీ చాలా ఆత్మీయతతో హగ్‌ చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథుల్ని కూడా తారక్‌ దంపతులే దగ్గరుండి ఆహ్వానించారు.  ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్‌ ‘మ్యాడ్‌’ సినిమాతో  హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారనే విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement