జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది.
దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్‌ఫుల్ రోల్‌ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్‌లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.
అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్‌ఫుల్ రోల్‌కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY
— Movie Tamil (@_MovieTamil) September 30, 2025


