
టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ – శివానీ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నితిన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అక్టోబర్ 10న హైదరాబాద్‌లో నెల్లూరుకు చెందిన శివానీని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ దంపతులే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి ప్రతి కార్యక్రమం ఆమె చేతుల మీదుగానే జరిపించారు. అయితే, తన బావమరిదికి పెళ్లి కానుకగా ఎన్టీఆర్ ఎలాంటి బహుమతి ఇచ్చారనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
కొత్త దంపతులు నితిన్–శివానీలకు పెళ్లి కానుకగా ఒక లగ్జరీ కారును ఎన్టీఆర్ ఇచ్చారని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. గతంలో ఇదే మాట తారక్ కూడా చెప్పారు. తనకు సినిమా ఛాన్సులు రావడం వెనుక ఎన్టీఆర్ ప్రధానంగా ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు తన బావమరిదికి ఏకంగా కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన లేనప్పటికీ రూమర్స్ మాత్రం బలంగానే వైరల్ అవుతున్నాయి.
పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ 2023లో ‘మ్యాడ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు.