అనంత: నారాయణ కాలేజీ వద్ద ఉద్రికత్త | Student Union Leaders Protest At Ananthapur Narayana College, More Details Inside | Sakshi
Sakshi News home page

అనంత: నారాయణ కాలేజీ వద్ద ఉద్రికత్త

Jan 29 2025 2:16 PM | Updated on Jan 29 2025 3:54 PM

Student Union Leaders Protest At Ananthapur Narayana College

సాక్షి, అనంతపురం: నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాలు కాలేజీకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

అనంతపురం నారాయణ కాలేజీ వద్ద విద్యార్థులు సంఘాలు ఆందోళనలకు దిగాయి. మంత్రి నారాయణను బర్తరఫ్‌ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేస్తున్నారు. కాగా, నారాయణ కాలేజీ బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఇటీవల చరణ్‌ అనే విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల మరణాలకు కారణమైన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

అంతకుముందు.. కొద్దిరోజుల క్రితమే నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్‌లో అందరితో పాటు కూర్చున్న విద్యార్థి ఒక్కసారిగా లేచి వెళ్లి, చెప్పులు విప్పేసి కారిడార్ నుంచి కిందకు దూకేశాడు. దాంతో తరగతిలో ఉన్న లెక్చరర్‌తో పాటు విద్యార్థులంతా షాకయ్యారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ చరణ్‌ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఇటీవ‌ల సంక్రాంతి సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చి వెళ్లిన కుమారుడు ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్య చేసుకోవడంతో త‌ల్లిదండ్రులు బోరున విల‌పిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత


 

Advertisement
 
Advertisement
Advertisement