డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌ఓ) కె.వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. శుక్రవారం డి.హీరేహాళ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు, ఓపీ, ల్యాబ్, ఫార్మసీ, వార్డుల గదులు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
కొట్టాలపల్లి పీహెచ్‌సీ తనిఖీ
విడపనకల్లు: మండలంలోని పెద్ద కొట్టాలపల్లి పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ జయకుమార్ నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి తిరుపాల్ నాయక్, ఎల్‌డీసీ మక్సద్, కోదండరామిరెడ్డి, సూపర్ వైజర్లు కుతుబుద్దీన్, పద్మకుమారి, పార్మసిస్టు కనకదుర్గ, స్టాఫ్ నర్సు లీలావతి పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి
బ్రహ్మసముద్రం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేశారనే అక్కసుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై బ్రహ్మసముద్రం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు వడ్డే వెంకటేష్, వడ్డే మంజమ్మ, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పరమేశ్వర్, దిలీప్, నాగరాజు, తిమ్మప్ప, అశోక్, కవితమ్మ, గుండమ్మ, రమేష్ ,ఈశ్వర్,దాసరి బాబు, వడ్డే రామాంజి, హరి, గొల్ల బాలరాజు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్ల వద్దకు వెళ్లి మహిళలను అసభ్యకరంగా దూషించి, దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శ్యామలమ్మ, లక్ష్మిదేవి, మోహన్, శివానంద, శృతి, జ్యోతి, హనుమంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గ్రామస్తులు 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


