● ఆర్వో తీరుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం
విడపనకల్లు: ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లే ఏజెంట్లకు (ఐడెంటీ కార్డులు), పాసులు ఇవ్వడంలోనూ ఆంక్షలు పెట్టారు. శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌటింగ్‌కు వెళ్లాలంటే పాసులు తప్పనిసరి. అయితే స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆర్వో కోసం ఉదయం 10 గంటల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు, ఏజెంట్లు వేచి చూశారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ఎంపీడీఓ వచ్చారు. గంటల తరబడి వేచి చూసిన అభ్యర్థులు, ఏజెంట్లు ఎంపీడీఓను పాసులు అడగ్గా.. కౌంటింగ్‌కు అభ్యర్థులతో పాటు ఒకరే ఏజెంటు ఉండాలని చెప్పారు. దీనిపై ఒక్క ఏజెంట్‌కు మాత్రమే పర్మిషన్ ఇస్తే ఎలా అని అని నిదీశారు. చివరికి కౌంటింగ్ ఏజెంట్‌కు పర్మిషన్ ఇచ్చేందుకు నిబంధనలు పెట్టారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్‌ను ప్రపోజ్ చేసే వ్యక్తిపై ఎలాంటి కేసులు లేవని, పోలీసులు సర్టిఫై చేస్తే పాసు ఇస్తానని మరో ట్విస్టు ఇచ్చారు. సాయంత్రం 6 గంటలవుతున్నా పాసులు ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏదో రకంగా కౌంటింగ్ హాల్ లోకి రాకుండా చేయాలని కుటిల యత్నం ఎన్నికల అధికారులు,పోలీసులు చేస్తున్నారన్న సంగతి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అర్థమైంది. దీంతో ఆర్వో పెట్టే నిబంధనలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏజెంట్లను ఎవరిని పెట్టుకోవాలో తలలు పట్టుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు గ్రామాలకు పోన్ చేసి ఏజెంట్లను వెదుకునే పనిలో పడ్డారు. చివరికి ఎన్నికల అధికారి పెట్టిన ఆంక్షలను దాటుకొని వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏజెంట్లను రెడీ చేసుకున్నారు.


