హరిత మృతిపై విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

హరిత మృతిపై విచారణ జరపాలి

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయురాలు ఎస్‌. హరితగౌడ్‌ అకాల మరణం చెందడంపై వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (వైఎస్సార్‌టీఏ) అనంతపురం జిల్లా శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది. సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. శుక్రవారం అనంతపురం మార్చురీలో ఉన్న హరితగౌడ్‌ భౌతికకాయాన్ని వైఎస్సార్‌టీఏ నాయకులు సందర్శించి, నివాళులర్పించారు. ఆమె కుమారుడు హరుణ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. వైఎస్సార్‌టీఏ గౌరవాధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవిందరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, పీడీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కే నరసింహారెడ్డి, పీడీలు ప్రభాకర్‌, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైఎస్సార్‌టీఏ నాయకులు పేర్కొన్నారు. తీవ్ర ఒత్తిడితో ఎన్నికల విధులు నిర్వహించాల్సి రావడంతో పలువురు పోలింగ్‌ సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement