
టాలీవుడ్ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివషయం తెలిసిందే. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం.. భాష ఉపయోగించి రెచ్చిపోయారు. దీంతో తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. అయితే, చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు మద్ధతుగా ఎవరూ నిలబడలేదు. కనీసం ఎమ్మెల్యే చేసిన మురికి వ్యాఖ్యలను తప్పుబట్టలేదు. ఆపై టీడీపీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాఖ్యలు వెనుక నారా లోకేశ్ ఉన్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు అనుదీప్ దేవరకొండ (అనుదీప్ దేవ్) రియాక్ట్ అయ్యారు. తారక్ సార్‌తో సంఘీభావంగా నిలబడుతున్నానంటూ తన మద్థతు ఇచ్చాడు.
తారక్‌కు సపోర్ట్‌గా రండి.. రేపొద్దున మీకూ ఇదే జరగొచ్చు
ఎన్టీఆర్‌కు మద్ధతుగా అనుదీప్ ఇలా చెప్పుకొచ్చారు. 'తారక్ సార్‌తో సంఘీభావంగా నిలబడుతున్నాను. సినిమా మనల్ని ఏకం చేస్తుంది. రాజకీయాలు మనల్ని విభజిస్తాయి. రెండింటినీ వేరుగా ఉంచుదాం. ఈ రోజు ఎన్టీఆర్‌కు ఎదురైన సందర్భం రేపు మరే ఇతర స్టార్‌కు ఎదురుకావచ్చు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను' అంటూ #StandWithNTR అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
'హనుమాన్' సినిమాతో పాపులర్
ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన అనుదీప్ 2011లో 'అహ నా పెళ్ళంటా' సినిమాతో సింగర్‌గా పరిచయమయ్యారు. అనుదీప్ ఇప్పటికే 70 చలన చిత్రాలలో సుమారుగా 100 పాటలకు పైగా పాడారు. 'హను మాన్' వంటి హిట్ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి, యువన్ శంకర్ రాజా,మిక్కీ జె. మేయర్,అనూప్ రూబెన్స్, థమన్, సంతోష్ నారాయణన్ వంటి వారితో ఆయన పనిచేశారు.
Standing in solidarity with @tarak9999 sir .
Cinema unites us, politics divides us. Let’s keep both separate. Today it’s NTR garu and tomorrow it could be any other star.
Requesting the entire TFI to stand together and support our beloved NTR garu.#StandWithNTR #TFIUnited— Anudeep Dev (@anudeepdev) August 19, 2025