
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ట్రైలర్ దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.

ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు.
కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్‌లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేయనున్నారు.