
మూసీ నది (Musi River) హైదరాబాద్‌ను శుక్రవారం రాత్రి అతలాకుతలం చేసింది. నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవటంతో నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి.

ఎన్నడూ లేనివిధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ను కూడా వరద ముంచెత్తింది. (Hyderabad Rains) ఒక్కసారిగా వరదనీరు బస్ స్టేషన్‌లోకి చొచ్చుకురావటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.




















