Musi River
-
మూసీ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది పరీవాహకంతోపాటు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది. ఇందుకు పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ కొత్తపేట్‌లోని న్యూ మారుతీనగర్వాసులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ మేరకు విచారణను ముగించింది. అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతీనగర్‌కు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని.. ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. అధికారులకు, పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు సూచనలివీ... – ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలి. – మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి. – పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలి. – మూసీలోని ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్‌లోని కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలతోపాటు 2023 నవంబర్ 8న ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్‌లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలి. – మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోవద్దు. – సర్వే కోసం వెళ్లే నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. – తెలంగాణ నీటిపారుదల చట్టం–1357 ఫస్లీ, వాల్టా చట్టం 2002లోని నిబంధనల ప్రకారం నదులు, నీటివనరులు, చెరువులు, సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూ కబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్‌లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్‌లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
ఏ తల్లి కన్నబిడ్డో..!
చాదర్‌ఘాట్: ఏ తల్లి కన్నబిడ్డో. ఓ పసికందు అనాథగా మారాడు. శనివారం ఉదయం వాహెద్‌నగర్ (ఓల్డ్ మలక్‌పేట్) మూసీ నది ఒడ్డున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పసికందు ఏడుస్తున్న శబ్దం విన్న స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో అజంపురా డివిజన్లోని ముస్లిం మెటరి్నటీ హాస్పిటల్లో పసికందుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ భరత్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
-
రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్‌లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్‌లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు...మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
KTR: కేసులు పెడతామని ఎవరు బెదిరించినా భయపడొద్దు
-
KSR Live Show: మూసీ యుద్ధం..
-
ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా: రేవంత్‌రెడ్డి
సాక్షి, వరంగల్ జిల్లా: బీఆర్ఎస్, బీజేపీ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని.. జెండా, అజెండా పక్కనపెట్టి మూసీ అభివృద్ధికి ప్రయత్నించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు దోచుకోవడమే తెలుసు, ప్రజల కష్టాలు తెలియవంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.‘‘ఒకప్పుడు మూసీలో అరుదైన చేపలు బతికేవి. ఇప్పుడు మూసీ నదిలో చేపలు బతికే పరిస్థితి లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో కల్లును అమ్ముకునే పరిస్థితి లేదుమూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంత వాసులకు వరంగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు, కూరగాయలు, పాలు కలుషితం అయ్యాయి. మూసీ నీటితో పండించిన పంటలకు మంచి ధర రావడం లేదు. నల్గొండ జిల్లాను ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ వెంటాడుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘మూసీ కాలుష్యంతో అణుబాంబు కంటే ఎక్కువ నష్టం జరుగుతోంది. మోదీ సబర్మతి ఫ్రంట్ రివర్, గంగానది ప్రక్షాళన చేస్తే అద్భుతం అంటున్నారు. మరి మేం మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా?. మూసీ ప్రక్షాళన చేయకపోతే నా జన్మ ఎందుకు?. ఎవరు అడ్డువచ్చినా మూసి ప్రక్షాళన చేసి తిరుతాం. ఎవరు వస్తారో రండి.. బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
మూసీ నదిలో రేవంత్ రెడ్డి పర్యటన
-
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
మూసీ పునరుజ్జీవ యాత్ర చేపట్టనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
-
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు. -
పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి
-
కిలోమీటర్‌కు రెండు వేల కోట్లా.. మూసీపై క్లారిటీ ఉందా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్‌కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్‌కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్‌కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
మూసీ పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు(శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు...మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్‌కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందిసంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. -
మూసీ నివాసితులను వెంటాడుతున్న కూల్చివేతల భయం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.కోర్టును ఆశ్రయించిన నివాసితులు మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్బీ మార్క్‌ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ కమిషన్‌కు దళిత కుటుంబాలు మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్‌ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్‌ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడుపక్కా నిర్మాణాలతోనే సమస్య.. మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. -
మూసీ అభివృద్ధికి కాదు.. మీ దోపిడీకి వ్యతిరేకం
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్‌లో 320 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు. మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి బీఆర్ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. -
మూసీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్
-
కేటీఆర్ అతి తెలివి.
-
మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్..!
-
సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్
-
మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్: హరీష్ రావు
సాక్షి, తెలంగాణభవన్: రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుజ్జీవనం అని చెబుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ పునరుజ్జీవనం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభం కావాలి. కేసీఆర్ హయంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.సీఎం మాటలతో అబద్దమే ఆశ్చర్యపోతోంది. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. శత్రుదేశాలపై దాడి చేసినట్టు పేదల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి. ఐదేళ్లలో రూ.లక్షా 50వేల కోట్లతో మూసీని ప్రక్షాళిస్తామన్నారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు.మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చర్చకు నేను సిద్ధం. రేపు(శనివారం) ఉదయం తొమ్మిది గంటలకు నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను రెడీ. సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్దాం. బాధితులకు మాట్లాడేందకు మీరు వస్తారా?. వారి వద్దకు వచ్చే దమ్ముందా? రివర్ ఫ్రంట్ ఏంటి..?. దాన్ని వెనుకున్న స్టంట్ ఏంటి? అని ప్రశ్నించారు. ముందు మూసీ వద్దకు పోదాం. తర్వాత కొండ పోచ్చమ్మ సాగర్, మల్లన్నసాగర్, కిష్టాపూర్ వద్దకు వెళ్దాం అన్నారు. మూసీలో పరివాహక ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. 10వేల మందికి సహాయం అవుతుంది అనుకుంటే మూడు నెలలు కాదు నాలుగు నెలలు మూసీ పక్కనే నివాసం ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది నాకు కృతజ్ఞత ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కృతజ్ఞత ఉండాలి. నేను మంత్రి అయినప్పుడు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ చేసిండు. నేను అమరవీరులకు నివాళులర్పిస్తుంటే.. రేవంత్ రెడ్డి నా వెనకాల నిలబడి హైట్ తక్కువ ఉంటాడు కదా.. కెమెరాల్లో కనపడాలని నక్కి నక్కి చూశాడు. మా మద్దతుతోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్