
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మూసీ వరద పెరగడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అంబర్‌పేట-ముసారంబాగ్ బ్రిడ్జి మూసివేశారు. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మూసీ ముంపు ప్రాంతాల ప్రజలను కమ్యూనిటీ హాల్ తరలించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్ నిండిపోయారు.

శంకర్‌పల్లిలో భారీ వర్షాలు, టంగుటూరు-మోకిలీ రోడ్డు మూసివేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వికారాబాద్, సంగారెడ్డికి రెడ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయ్యింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 6.8 సెం.మీ, గద్వాల జిల్లా ఐజలో 6.4 సెం.మీ, గట్టులో 6.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 6.2 సెం.మీ వర్షపాతం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 6.2 సెం.మీ, మహబూబ్‌నగర్ కౌకుంట్లలో 5.9 సెం.మీ, డబీర్‌పురాలో 3.1 సెం.మీ,రాజేంద్రనగర్‌లో 2.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.