సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని చిట్యాల వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. వీరంతా తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనికి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


