breaking news
Overflows
-
వరద విలయం.. వామ్మో.. ఆ గ్రామంలో రెండు కిలోమీటర్ల గొయ్యి
జైపూర్: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయకరంగా ఉంటుంది. రాజస్థాన్లో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో 2 కిలోమీటర్ల పొడవైన పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్రామం, పొలాల మీదుగా నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ గుంత 2 కిలోమీటర్లు పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉంది.వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ గొయ్యి కారణంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి నీటి మునిగింది. వరద ఉధృతికి రెండు ఇళ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు కూలిపోయాయి. పొలాల మీదుగా వచ్చిన నీరు గుంతలోకి ప్రవహించి జలపాతంలా మారింది.ఆ గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్ మీనా గుంతపై ఆరా తీశారు. వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు యంత్రాల సహాయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.सवाई माधोपुर, राजस्थान के जाडावता गांव में भारी बारिश से स्थिति बेहद गंभीर हो गई है। यहाँ मानो 'नियाग्रा फॉल्स' फूट पड़ा है, जहाँ कभी अमरूद के बाग और हरे-भरे खेत हुआ करते थे, वहाँ अब पानी के तेज बहाव ने उन्हें एक गहरी नदी में बदल दिया है। पानी के लगातार कटाव से जमीन चौड़ी ..1/2 pic.twitter.com/poyX33CkPq— Lokesh kumar (@lkmeena8619) August 24, 2025రాజస్థాన్.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది.. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝాలావార్ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది కనిపిస్తోంది. కోటా జిల్లాలోని నిమోడా గ్రామంలో 400కి పైగా ఇల్లు కూలిపోయాయి. వందలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటుకున్నారు. -
నిజాంసాగర్ కెనాల్ కు గండి
-
Kolleru Lake: ఎగువ నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు
కైకలూరు: కొల్లేరు సరస్సు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి కొల్లేరుకు వరద నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరిన వరద నీరు సముద్రానికి చేరే మార్గమధ్యంలో అక్రమ చేపల చెరువులు అడ్డు వస్తున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క తోడవడంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పాకుతోంది. కొల్లేరు గ్రామాల్లో పలు అక్రమ చేపల చెరువులకు గండ్లు పడటంతో రహదారులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రక్షాళన అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలింపాకలంక గ్రామస్తుల ప్రధాన మార్గమైన పెదఎడ్లగాడి – పెనుమాలంక రహదారి కొల్లేరు వరద నీటికి మునిగింది. దశాబ్దాలుగా ఇదే సమస్య కొల్లేరు గ్రామాల ప్రజలను పట్టి వేధిస్తోంది. పెద ఎడ్లగాడి వంతెన దిగువన ఈ గ్రామాలు ఉండటంతో వరద నీరు వెనక్కి వచ్చి ముంచెత్తుతోంది. పెదఎడ్లగాడి వద్ద 8.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. అదే విధంగా కైకలూరు–ఏలూరు రహదారిలో ఇరువైపులా కొల్లేరు నీరు గట్లను తాకుతోంది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదకరంగా ఇనుప వంతెన... సర్కారు కాల్వపై ఇనుప వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేయడానికి పందిరిపల్లిగూడెం వద్ద ఇనుప వంతెనను గ్రామస్తులు నిర్మించారు. ఇటీవల వంతెనపై రేకులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు కింద నుంచి ప్రవాహ వేగం పెరిగింది. టోల్గేట్దారులు భారీ వాహనాలను సైతం వంతెనపై అనుమతిస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. అడ్డు వస్తున్న చేపల చెరువులు కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి చేరవేసే క్రమంలో అక్రమ చేపల చెరువు గట్లు అడ్డు వస్తున్నాయి. తెలుగుదేశం పాలనలో కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తవ్వేశారు. అడ్డుకున్న అటవీ సిబ్బందిపై టీడీపీ నేతల అండతో దాడులు సైతం చేశారు. కొల్లేరులో డ్రెయిన్లు సైతం అక్రమించారు. ఈ కారణంగా వరదల సమయంలో చేరుతున్న నీరు కిందకు చేరడం లేదు. పెద ఎడ్లగాడి వంతెన వద్ద 8 అడుగులు నీటి మట్టం ఉంటే, దిగువన ఉన్న ఉప్పుటేరు వంతెన వద్ద కేవలం 4 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి నీరు కిందకు రావడానికి చేపల చెరువుల గట్లు అడ్డుపడుతున్నాయి. గుర్రపుడెక్కతో చిక్కులు ఎగువ నుంచి కొట్టుకువస్తున్న గుర్రపుడెక్కతో ప్రతీ ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. కొల్లేరుకు చేరుతున్న నీటిని సముద్రానికి చేరవేయడానికి పెద ఎడ్లగాడి వంతెన మార్గంగా ఉంది. ఈ వంతెనకు ఉన్న 56 ఖానాలలో ఇప్పుడు గుర్రపుడెక్క పేరుకుపోయింది. మేటలు వేసిన గుర్రపుడెక్క కారణంగా నీరు వెనక్కి మల్లుతుంది. ఈ కారణంగా పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక చేరే రహదారి నీట మునిగింది. సాదరణంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైనుంచి చేరుతున్న నీటితో కొల్లేరుకు వరద పోటు వస్తుంది. గుర్రపు డెక్క తొలగిస్తాం పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్కను మనుషులతో తొలగిస్తాం. దీనికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. పొక్లయిన్తో తొలిగిస్తుంటే వంతెన పాడవుతుందని ఆర్అండ్బీ అధికారులు అడ్డు చెబుతున్నారు. దీంతో మనుషులను పెడుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 8.6 అడుగులు నీటి మట్టం నమోదయ్యింది. 12 అడుగులకు చేరితే మరింత ప్రమాదం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. – బి.ఇందిరా, డ్రెయినేజీ జేఈఈ, కైకలూరు -
ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి
భైంసా (ముధోల్)/ధరూరు: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం నుంచి నది వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన హరిహర కాటేజ్ నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గినా నదిలో వరద ప్రవాహం మాత్రం గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత బాసర ఆలయం వైపు వెళ్లే మార్గాన్ని సైతం ముంచెత్తింది. ఇదే మార్గంలో ఉన్న హరిహర కాటేజ్ నీట మునిగింది. అందులో ఉన్నవారంతా అప్రమత్తమై స్లాబుల పైకి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పడవల సాయంతో కాటేజ్ వద్దకు చేరుకుని 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరోవైపు వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతూ మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణ ఆలయానికి తాకింది. రైల్వే వంతెన నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న పొలాలన్నీ నీటమునిగాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు. జూరాలకు మళ్లీ వరద ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి 1,27,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని 11యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1,60,553 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.214 టీఎంసీలు ఉంది. -
మూసీ నది లో పెరుగుతున్న వరద ఉద్ధృతి ఫొటోలు
-
12 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
అశ్వారావుపేట (ఖమ్మం) : భారీ వర్షాలతో గోదావరి పొంగటంతో ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరదతో గుండేటి వాగు పొంగి 12 గ్రామాలను చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాలకు సోమవారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు స్తంభించాయి.