
జైపూర్: ప్రకృతి చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయకరంగా ఉంటుంది. రాజస్థాన్‌లో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో 2 కిలోమీటర్ల పొడవైన పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్రామం, పొలాల మీదుగా నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ గుంత 2 కిలోమీటర్లు పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉంది.
వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ గొయ్యి కారణంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి నీటి మునిగింది. వరద ఉధృతికి రెండు ఇళ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు కూలిపోయాయి. పొలాల మీదుగా వచ్చిన నీరు గుంతలోకి ప్రవహించి జలపాతంలా మారింది.
ఆ గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్ మీనా గుంతపై ఆరా తీశారు. వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు యంత్రాల సహాయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
सवाई माधोपुर, राजस्थान के जाडावता गांव में भारी बारिश से स्थिति बेहद गंभीर हो गई है। यहाँ मानो 'नियाग्रा फॉल्स' फूट पड़ा है, जहाँ कभी अमरूद के बाग और हरे-भरे खेत हुआ करते थे, वहाँ अब पानी के तेज बहाव ने उन्हें एक गहरी नदी में बदल दिया है। पानी के लगातार कटाव से जमीन चौड़ी ..1/2 pic.twitter.com/poyX33CkPq
— Lokesh kumar (@lkmeena8619) August 24, 2025
రాజస్థాన్.. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది.. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝాలావార్ జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది కనిపిస్తోంది. కోటా జిల్లాలోని నిమోడా గ్రామంలో 400కి పైగా ఇల్లు కూలిపోయాయి. వందలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటుకున్నారు.