breaking news
moosarambagh
-
మూసీ మహోగ్రరూపం.. బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా
తెలంగాణ వర్షాలు.. అప్డేట్స్.. చాధర్ఘాట్ ప్రాంతంలో మూసీ ఉదృతంగా ప్రవహించడంతో ఇళ్లల్లోకి చేరిన వరద నీరువరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేస్తున్న అధికారులుమూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్మూసీ నది మహోగ్రరూపంఅంతకంతకు పెరుగుతున్న వరద.. పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన హైడ్రా కమిషనర్ఎంజీబీఎస్లో పరిస్థితిని పరిశీలించిన రంగనాథ్సహాయక చర్యలను పర్యవేక్షించి.. సిబ్బందికి కీలక సూచనలు చేసిన హైడ్రా కమిషనర్ 30 ఏళ్ల తర్వాత మూసీ ఉగ్రరూపం..13 ఫీట్ల ఎత్తులో పారుతున్న మూసీ నదిపురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో పారుతున్న మూసీ నది30 ఏళ్ల తరువాత అత్యంత భారీగా మూసీ ప్రవాహంమూసీ వరద తాకిడికి మునిగిపోయిన ఆలయాలు.శివాలయంపైనే పూజారి కుటుంబంవారికి టిఫిన్స్ అందించిన హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బందిమూసీ వరద తాకిడిలో చిక్కుకుపోయిన 11 మందిని రక్షించిన హైడ్రా.మిగతా వాళ్లకు డ్రోన్ల సాయంతో సహాయం అందచేసిన అధికారులు.అందరినీ రక్షించేందుకు ఏర్పాట్లు. ఎంజీబీఎస్‌కు బస్సులు బంద్మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణీకులు సౌకర్యం కోసం కీలక ప్రకటన వెల్లడించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్నగర్ వరకే అనుమతికర్నూలు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వద్ద మళ్లింపువరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే అనుమతిరిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లు మార్చాంరేపు మరో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారు🚨 Important Alert for Passengers 🚨Due to heavy floods in #Musi River, water has entered #MGBS premises. Hence, #bus operations from MGBS are temporarily suspended.🔸 Services diverted from other locations:#Adilabad, #Karimnagar, #Medak, #Nizamabad → from #JBS#Warangal,… pic.twitter.com/Xi1B8ybT5u— IPRDepartment (@IPRTelangana) September 27, 2025చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్జామ్చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్జామ్చిన్న వంతెన మూసివేయడంతో పెద్ద వంతెనపైనే రాకపోకలుచాదర్ఘాట్ వద్ద కేవలం పెద్ద వంతెన పైనుంచే ప్రయాణిస్తున్న వాహనాలుఎక్కడిక్కడే స్తంభించిన వాహనాలువంతెనకు రెండు వైపులా భారీగా ట్రాఫిక్జామ్మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిహైదరాబాద్ శివారులో మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిఘట్కేసర్ మండలంలోని మూసీ వంతెనలపై ప్రవహిస్తున్న వరదప్రతాపసింగారం, కొర్రెముల వద్ద మూసీ వంతెనపై నుంచి వరద ప్రవాహంవంతెనల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో నిలిచిన రాకపోకలు మరో రెండు గంటల్లో భారీ వర్షాలు..మరో రెండు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, హనమకొండ, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాకు భారీ సూచనహైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం DISTRICTS WARNING - Next 2hrs ⚠️🌧️ MODERATE - HEAVY RAINS to continue in Peddapalli, Bhupalapally, Karimnagar, Siddipet, Jangaon, Yadadri - Bhongir will further cover Hanmakonda, Medak, Sircilla, Kamareddy, Sangareddy ⚠️🌧️MODERATE RAINS ahead in Vikarabad, Rangareddy,…— Telangana Weatherman (@balaji25_t) September 27, 2025యాదాద్రి.. మూసీ ఉగ్రరూపం..జూలూరు-రుద్రవల్లి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ.బ్రిడ్జిపై నుంచి భారీగా ప్రవహిస్తున్న మూసీ వరద.పోచంపల్లి -బీబీనగర్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు.వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వ వద్ద పైనుంచి ప్రవహిస్తున్న మూసీచౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలకు అంతరాయం.ముందస్తు చర్యగా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులుమత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక. పురానాపూల్‌లో వరద బీభత్సం..పురానాపూల్‌లో నీట మునిగిన శివుడి ఆలయం.శివుని దేవాలయంలో ఉన్న పూజారి కుటుంబంఆలయంలో ఉండిపోయిన పూజారి కుటుంబంశివుడి దేవాలయం పైభాగం వరకు చేరుకున్న వరద నీరుసహాయం కోసం ఆలయం పైకెక్కి అర్తనాదాలు చేస్తున్న పూజారి కుటుంబంగుడి సమీపంలో నివాసం ఉంటున్న పూజారి కుటుంబంమొదటి అంతస్థులో చేరి సహాయం కోసం ఎదురుచూపులుTELANGANA RAINFALL FORECAST | 27TH SEPTEMBERDEPRESSION EFFECT DAY-3 (FINAL)Depression is currently over NORTH-EAST TELANGANA and will move towards MARATHWADA region by night.WEST & CENTRAL Telangana:Widespread HEAVY RAINS likely, with Localized VERY HEAVY RAINS in a few… pic.twitter.com/1UVqcmJPse— Hyderabad Rains (@Hyderabadrains) September 27, 2025వర్షాలపై సీఎం రేవంత్ ఆరా..రాష్ట్రంలో వర్షాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డిహైదరాబాద్లో వరద, సహాయక చర్యల గురించి ఆరా తీసిన సీఎంమూసీ వెంట లోతట్టు ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశంలోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశంముంపు కాలనీల వాసులకు పునరావాసం కల్పించాలని సీఎం ఆదేశం రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షంచేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుదేవరంపల్లివాగు నుంచి హిమాయత్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరదపరివాహక ప్రాంతంలో నీటమునిగిన పొలాలుప్రజల ఎవరిని రానివ్వకుండా అప్రమత్తం చేసిన పోలీసులు ప్రయాణికులను బయటకు తరలించాం: అధికారిఎంజీబీఎస్ అధికారి కామెంట్స్..రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లోకి వరద వస్తోందిఎంజీబీఎస్ వద్ద వరద దృష్ట్యా ప్రయాణికులను బయటకు తరలించాంతాత్కాలికంగా ఎంజీబీఎస్లోనికి బస్సులు అనుమతించడం లేదువరద ప్రవాహం దృష్ట్యా ఎంజీబీఎస్‌లోని బస్సులు బయటకు పంపించాంవివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించాంఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్సుఖ్నగర్ వరకే అనుమతికర్నూలు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వద్ద మళ్లింపువరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే అనుమతిరిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లు మార్చాంరేపు మరో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారుచాదర్ఘాట్ చిన్న వంతెనపై ఆరు అడుగుల మేర వరదచాదర్ఘాట్ చిన్న వంతెనపై 6 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదమూసారంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదవరద నీటిలో కొట్టుకుపోయిన నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామగ్రివరద నీటిలో కొట్టుకుపోయిన స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రిఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ నదిఎంజీబీఎస్కు వచ్చే రెండు వంతెనల పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరుఎంజీబీఎస్లో ప్రయాణికులను ఖాళీ చేయించిన అధికారులుఎంజీబీఎస్ వద్ద డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలుసురక్షితంగా ప్రాంతాలకు బస్సులను తరలించిన అధికారులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిమూసీ పరివాహక ప్రాంతంలోని మూసానగర్, శంకర్నగర జలమయంమూసానగర్, శంకర్‌నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపుమూసానగర్, శంకర్‌నగర్‌లో ఇళ్లలోకి చేరిన మూసీ వరద నీరుకిషన్బాగ్, బాబానగర్ ప్రాంతాల్లో పెరిగిన మూసీ నది ప్రవాహంస్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులుబండ్లగూడ పటేల్‌నగర్‌లో ఇళ్లలోకి చేరిన మురుగు, వర్షపు నీరుమూసీ పరివాహక ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపులోతట్టు ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక, హైదరాబాద్‌లో(Hyderabad Rains) ఏకధాటిగా కురుస్తున్న వానలతో జంట జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరడంతో గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.#Hyderabad MGBS busstand 😳😳😳. This is grater hyderabad 😟😟😟😟😟 pic.twitter.com/OrLN4oUum7— Harsha💥 (@2Ysjagan) September 27, 2025శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ(Moosi River) నది మహోగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దీంతో, ఎంజీబీఎస్‌లోకి(MGBS Bus Stand) వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. ఈ క్రమంలో మూసీ వరద ఎంజీబీఎస్ బస్డాండ్‌లోకి చేరింది. ఒక్కసారిగా వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.రెండు రోజులు భారీ వర్షాలు తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ మరింత బలపడి వాయవ్య, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. Severe Flooding Hits Hyderabad’s MGBS Bus Station,Overflowing Musi River has flooded the bus station, stranding hundreds. NDRF is conducting rescue operations. People are advised to avoid the area.#HyderabadRains #MGBS #Musi#HyderabadFloods pic.twitter.com/KomggkYYoX— Hakku Initiative (@HakkuInitiative) September 26, 2025 Current situation at MGBS .. pic.twitter.com/4QS6qdKAXG— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) September 26, 2025 Musi overflow Near Mgbs, Koti Be carefull Hyderabad vasiyoooo ✅@revanth_anumula @GHMCOnline #Hyderabadrains #monsoonrains pic.twitter.com/m8xYIPOXW9— 𝙊𝙓𝙓𝙔🐉🀄️ (@Oxxy_7) September 26, 2025 -
మూసీ డేంజర్ బెల్స్.. ముసారంబాగ్ బ్రిడ్జి మూసివేత
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మూసీ వరద పెరగడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అంబర్‌పేట-ముసారంబాగ్ బ్రిడ్జి మూసివేశారు. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మూసీ ముంపు ప్రాంతాల ప్రజలను కమ్యూనిటీ హాల్ తరలించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్ నిండిపోయారు.శంకర్‌పల్లిలో భారీ వర్షాలు, టంగుటూరు-మోకిలీ రోడ్డు మూసివేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వికారాబాద్, సంగారెడ్డికి రెడ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయ్యింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.తెలంగాణలో రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 6.8 సెం.మీ, గద్వాల జిల్లా ఐజలో 6.4 సెం.మీ, గట్టులో 6.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 6.2 సెం.మీ వర్షపాతం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 6.2 సెం.మీ, మహబూబ్‌నగర్ కౌకుంట్లలో 5.9 సెం.మీ, డబీర్‌పురాలో 3.1 సెం.మీ,రాజేంద్రనగర్‌లో 2.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
భారీ వరదలు..మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
రోజంతా ముసురు.. కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు ప్రధాన రోడ్లు జలమయంగా మారగా.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అటు వాహనదారులు..ఇటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మలక్పేట్జోన్ పరిధిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అలాగే డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మలక్‌పేట్, చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది.తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు పైనుంచి వస్తున్న వరదతో మలక్‌పేట్‌లోని మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపిశారు. అంతేగాకుండా జీహెచ్ఎంసీ అధికారులు మూసీ తీరవాసులను అప్రమత్తం చేశారు. దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట్, మున్సిపల్ కాలనీ, పద్మనగర్, కాలడేర, మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి, అజంపురా, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్కేపురం, ఐఎస్‌సదన్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతాల్లోని నాలాలు పూర్తిగా పూడుకుపోయి ము రుగునీరంతా రోడ్లపై కాలనీల్లో ప్రవహిస్తోంది. నాలాల్లోని పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేపట్టకపోవడంతోనే వరద సరిగా ప్రవహించలేక కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొంగుతున్న డ్రైనేజీలు మలక్‌పేట్, ఎన్టీఆర్నగర్, అల్కాపురి, భగత్‌సింగ్‌నగర్, ఓల్డ్‌మలక్‌పేట్, తీగలగూడ తదితర కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పారుతున్న మురుగుతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షానికి లోతట్టు కాలనీల ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ముంపు సమస్యతో భయందోళన చెందుతున్నారు. మలక్‌పేట్‌లోని మూసీ లోతట్టు కాలనీల్లో జీహెచ్ఎంసీ అధికారులు పర్యటించి అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. -
HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్పేట్ నుంచి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్‌పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని సాధారణ వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్‌నగర్ వైపు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద కుడి మలుపు తిరిగి పిస్తా హౌస్, మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లి సహకరించాలని పోలీసులు కోరారు. చదవండి: పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్ -
Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్/ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజధాని హైదరాబాద్ మహానగరంలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉధృతంగా మూసీ.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత హైదరాబాద్‌లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు మూసీలో వదలడంతో మూసారాంబాగ్ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మూసీ వాగు ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. #HyderabadRains Moosarambagh bridge is being closed from 9 Pm this evening due to increase in water levels in Musi as about 6000 cusecs is released from Osmansagar & Himayathsagar into Musi .. We will review the situation tomorrow pic.twitter.com/krWO8uqTyW — Arvind Kumar (@arvindkumar_ias) September 5, 2023 మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో :1013.18 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో : 3753.81క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 643.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ : 4.09టీఎంసీలు ఉంది. చదవండి: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు జంట జలాశయాలకు భారీగా వరద నీరు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
బిగ్ అలర్ట్..ముసారాంబాగ్ బ్రిడ్జ్
-
నవీన్ హత్యకు ముందు జరిగింది ఇదే.. పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్?
సాక్షి, హైదరాబాద్: ఎంజీ కాలేజీ విద్యార్థి నవీన్ దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేశారు. అనంతరం, నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో, కోర్టు హరిహరకృష్ణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక, హయత్‌నగర్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. హత్యకు తర్వాత జరిగింది ఇదే.. హత్య తర్వాత హరిహరరావు వరంగల్‌కు పరారీ అయ్యాడు. హత్య జరిగిన రెండు రోజులు నవీన్ స్నేహితులకు నిందితుడు ఫోన్ చేశాడు. తర్వాత.. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.. నవీన్ మిస్ అయ్యాడంటూ కట్టుకథ అల్లాడు. దీంతో, వారు హరిహరకృష్ణ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే తనకు తానుగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్టేషన్లో హత్యకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలను వెల్లడించాడు. కాగా, విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు. కాగా, నవీన్ హత్య కోసం హరహరకృష్ణ మూడు నెలల క్రితమే ప్లాన్ చేశాడు. రెండు నెలల క్రితం కత్తిని కొనుగోలు చేశాడు. హత్యకు ముందు క్రైమ్ వెబ్ సిరీస్, సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. హత్య తర్వత శరీర భాగాలను పాశవికంగా వేరు చేశాడు. మృతదేహంపై దుస్తులను తొలగించినట్టు తెలిపాడు. అయితే, ఈ హత్యపై పోలీసులు ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. -
ఆమె కేవలం ఫ్రెండ్ అంతే!: నవీన్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాను ప్రేమించిన అమ్మాయితో.. చనువుగా ఉండటం భరించలేకే స్నేహితుడిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు హరిహర కృష్ణ. అయితే స్నేహితుడే తన కొడుకుపై ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని నవీన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీతో మృతుడు నవీన్ తండ్రి శంకర్ నాయక్ పోలీసులతో మాట్లాడుతూ.. గెట్ టు గెదర్ పేరుతో నా కొడుకుని పిలిచి హత్య చేశాడు. కాకపోతే.. హరిహర కృష్ణ పద్ధతి నచ్చక ఆ అమ్మాయి దూరం అయిందని అంతా చెప్తున్నారు. మా అబ్బాయి నవీన్ ఆ అమ్మాయితో ప్రేమలో లేడు. వాళ్లిద్దరూ కేవలం స్నేహితులే. నవీన్‌కు ఆ అమ్మాయి దగ్గర అవుతుందేమో అనే అనుమానంతోనే హత్య చేశాడు. ఈ హత్యలో ఆ అమ్మాయి ప్రేమేయం ఉందో, లేదో కూడా మాకు తెలియదు అని చెప్పారాయన. ఏది ఏమైనా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వాడిని కఠినంగా శిక్షించాలి అని కోరుతోంది బాధిత కుటుంబం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో పూర్తి సమాచారం పొందుపరిచారు. నిందితుడు పేరాల హరిహర కృష్ణ, మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌కు చెందినవాడు. నిందితుడు తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించే సమయంలో అతనిచ్చిన స్టేట్మెంట్ ఇలా ఉంది. నవీన్ , నేను దిల్షుక్ నగర్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఆ సమయంలో నేను ఒక స్నేహితురాలిని ప్రేమించా. కొన్ని కారణాల వల్ల ఆమె నాకు దూరం అయ్యింది. కానీ, నవీన్ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమెను ప్రేమించాడు!. ఆ అమ్మాయి కూడా నవీన్‌తో సన్నిహితంగా మెలిగింది. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక.. మూడు నెలల కిందట నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నా. కొద్దీ రోజుల్లోనే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి నవీన్ కోచింగ్ రాబోతున్నట్లు తెలుసుకున్నా. హైదరాబాద్ వస్తే నా లవర్‌కు మరింత దగ్గర అవుతాడేమో అనిపించింది. అందుకే టైం కోసం ఎదురు చూశా. ఫిబ్రవరి 17వ తేదీన.. నేనూ, నవీన్ ఎల్బీ నగర్లో కలుసుకున్నాం. కాసేపు అలా తిరిగాం. ఆ తర్వాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి వెళ్లాం. రాత్రి కాగానే.. తాను హాస్టల్ వెళ్తానని చెప్పాడు. దీంతో బైక్‌పై ఇద్దరం బయల్దేరాం. పెద్ద అంబర్‌పేటకు చేరుకోగానే మా ఇద్దరి మధ్య ఆ యువతి విషయమై గొడవ మొదలైంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కత్తితో దాడి చేశా. నవీన్‌ను చంపేసి ప్రైవేట్ భాగం, గుండె, తన, చేతి వేళ్లు, చేతులు.. అన్నింటిని కత్తితో వేరు చేసి.. అక్కడి నుంచి పరారయ్యాను. విజయవాడ హైవే పక్కన పడేశాను.. ఇది ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్న విషయాలు. ఈ మేరకు విషయాలన్ని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు స్నేహితులు. నిందితుడు హరిహర కృష్ణ పై సెక్షన్ 302, 201 ఐపీసీ , 5(2) (V) , SC ,St, POA act 2015 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇక.. తన మీదకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఘటన తర్వాత నవీన్ స్నేహితులకు కాల్ చేశాడు హరి. నవీన్ మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని డ్రామాలాడాడు. అమ్మాయి పాత్రపై విచారణ చేపట్టాం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై సాక్షీ టీవీ తో ఎల్బీనగర్ డీసీపి సాయి శ్రీ మాట్లాడారు. నల్గొండ ఎంజీ యూనివర్సిటీ కి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణ ను అరెస్ట్ చేశాము. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నాము . హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉంది. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య గా స్పష్టమైంది. నవీన్ ను అతి కిరాతకంగా పొడిచి చంపిన నిందితుడు హరిహరకృష్ణ. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో తేల్చాల్సి ఉంది. నవీన్ , హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులు అని తెలిపారాయన. ఒత్తిడి తట్టుకోలేకే.. నేనావత్ నవీన్‌ది నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్ల గ్రామం. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) నాలుగో ఏడాది చదువుతున్నాడు. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్ రాకపోవడంతో ఈ నెల 22న తండ్రి శంకర్ నాయక్ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నార్కట్‌పల్లి ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు. అయితే.. అదేరోజు సాయంత్రం నుంచి హరి ఫోన్ స్విఛ్చాఫ్ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు హరిహర కృష్ణ. -
4 వంతెనలు, 3 నెలల్లో టెండర్లు .. మూసీపై బ్రిడ్జీల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మూసీపై 4 హైలెవల్ వంతెనల నిర్మాణ బాధ్యతల్ని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. నాలుగు బ్రిడ్జిల అంచనా వ్యయం రూ.168 కోట్లు. వీటి నిర్మాణంతో వానల సమయాల్లోనే కాకుండా అన్ని సమయాల్లోనూ రాబోయే అయిదారు దశాబ్దాలపాటు ప్రజలకు సాఫీ ప్రయాణం సాధ్యమయ్యేందుకు క్షేత్రస్థాయి సర్వే, తగిన డిజైన్లు, ఇతరత్రా పనుల కోసం కన్సల్టెన్సీల సేవలు పొందేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు మూడు నెలల్లో పూర్తిచేసి, దాదాపు ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బ్రిడ్జి పనుల్లో భాగంగానే అప్రోచ్‌లు, సర్వీస్‌రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, డక్ట్లు, సెంట్రల్ మీడియన్లు, కెర్బ్‌లు, స్ట్రీట్లైట్ల ఏర్పాటు వంటి పనులు సైతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సర్వేలో ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలు.. ►రోడ్డు వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు తగిన భద్రత. ►వీలైనంత తక్కువగా భూసేకరణ. ►నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు వీలైనంత తక్కువగా ఉండాలి. ►నిర్మాణం త్వరితంగా పూర్తయ్యేందుకు వినూత్న ఆలోచనలతో, ఆధునిక సాంకేతికతను వినియోగించాలి. ►కొత్త బ్రిడ్జిలు ఇలా ఉండాలి.. ►ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా నిరంతరం సాఫీ మూవ్మెంట్ ఉండాలి. ► బ్రిడ్జి వెడల్పు, లేన్లు పెంచి సామర్థ్యం పెంచాలి. ►ఫుట్‌ఫాత్‌ల కింద టెలికాం, విద్యుత్ తదితర కేబుళ్లకు డక్ట్లుండాలి. ►పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన సదుపాయాలుండాలి. ►ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు మార్కింగ్లుండాలి. ►మొత్తానికి ప్రజా రవాణా మెరుగవ్వాలి. పర్యాటక ఆకర్షణగా.. మూసారంబాగ్, చాదర్ఘాట్ల వద్ద బ్రిడ్జి పనులు పది రోజుల్లో ప్రారంభించి, 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఇటీవల మూసారాంబాగ్ బ్రిడ్జి ముంపు సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించినప్పటికీ, పనులు మొదలయ్యేందుకు సమయం పట్టనుంది. డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియకే మూడునెలలు పట్టనుంది. మూసీపై నిర్మించే బ్రిడ్జిల డిజైన్లు ప్రత్యేకంగా ఉండేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వాటికోసం పోటీలు కూడా నిర్వహించారు. డిజైన్లు మంత్రి పరిశీలనలో ఉన్నాయి. చదవండి: హైటెక్ స్టేషనండి.. రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసినా.. బండి ఆగదండి నిధులెలా..? నాలుగు బ్రిడ్జిలకు వెరసి రూ. 168 కోట్లు అవసరం కాగా, సదరు నిధుల్ని జీహెచ్ఎంసీ ఎలా సమకూర్చుకోనుందో ఇంకా స్పష్టత రాలేదు. డీపీఆర్‌ల తయారీకి మూడునెలల సమయమున్నందున ఆలోగా బ్యాంకులోన్లు తీసుకోవడమో, బాండ్ల ద్వారా సేకరించడమో చేసే అవకాశం ఉంది. లేదా జీహెచ్ఎంసీ ఖజానా నుంచే పనులు జరిగేకొద్దీ విడతల వారీగా చెల్లింపులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. బ్రిడ్జిలు– అంచనా వ్యయాలు.. 1.మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు 2. మూసారాంబాగ్‌ను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి:రూ.52కోట్లు 3.చాదర్‌ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి : రూ.42 కోట్లు 4. అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు -
మూసారాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద తగ్గిన వరద ప్రవాహం
-
మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలు క్లోజ్..
-
మూసారంబాగ్ బ్రిడ్డిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
-
మూసారాంబాగ్ - అంబర్ పేట రహదారి మూసివేత
-
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో సేవలకు అంతరాయం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెడ్‌లైన్ మెట్రో రూట్లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఓ రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
మూసారాంబాగ్: మూసీలో మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతేరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది. చదవండి: గులాబ్ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..! -
కిడ్నాప్ కేసు: 24 గంటల్లో చేధించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ముసారాంబాగ్‌లో కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వివరించారు.. ఈ నెల 27న ముసారాంబాగ్ ఎస్బీఏ ఎదురుగా తల్లిదండ్రులతో కలిసి అమ్ములు అనే చిన్నారి నిద్రిస్తుండగా.. అదే సమయంలో కాలవల శ్రవణ్ అనే వ్యక్తి పాపను కిడ్నాప్ చేశాడని తెలిపారు. అనంతరం పాప తండ్రి అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతంలో నిందితుడు శ్రవణ్ కుమార్ ఆటో నడుపుతూ నేరాలకు పాల్పడేవాడని అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడిపై మలక్ పేట్, కాచిగూడ, సరూర్ నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయన్నారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి రంగారెడ్డి: పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మాహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం మండల్ పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లేఅవుట్ విషయంలో శ్రీనివాస్ లంచం డిమాండ్ చేయగా..ఏడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదున్నర ఎకరాల భూమి లే అవుట్ అనుమతి ఇవ్వడం కోసం అధికారులులంచం డిమాండ్ చేయగా ..ఇదే కేసులో ఐదున్నర లక్షలు తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త రమేష్, ఉప సర్పంచ్ దొరికారు. -
నకిలీ నెయ్యి కేంద్రంపై పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ పరిధిలో ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముసారంబాగ్‌లో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నెయ్యి తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4500 కిలోల నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.


