నకిలీ నెయ్యి కేంద్రంపై పోలీసుల దాడి | fake ghee seized in hyderabad moosarambagh | Sakshi
Sakshi News home page

నకిలీ నెయ్యి కేంద్రంపై పోలీసుల దాడి

Apr 24 2016 8:14 AM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని మలక్‌పేట్ పరిధిలో ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ పరిధిలో ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముసారంబాగ్‌లో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నెయ్యి తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4500 కిలోల నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.... పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement