
తెలంగాణ వర్షాలు.. అప్‌డేట్స్..
మరో రెండు గంటల్లో భారీ వర్షాలు..
మరో రెండు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, హనమకొండ, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాకు భారీ సూచన
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం
DISTRICTS WARNING - Next 2hrs ⚠️🌧️
MODERATE - HEAVY RAINS to continue in Peddapalli, Bhupalapally, Karimnagar, Siddipet, Jangaon, Yadadri - Bhongir will further cover Hanmakonda, Medak, Sircilla, Kamareddy, Sangareddy ⚠️🌧️
MODERATE RAINS ahead in Vikarabad, Rangareddy,…— Telangana Weatherman (@balaji25_t) September 27, 2025
యాదాద్రి.. మూసీ ఉగ్రరూపం..
- జూలూరు-రుద్రవల్లి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ.
- బ్రిడ్జిపై నుంచి భారీగా ప్రవహిస్తున్న మూసీ వరద.
- పోచంపల్లి -బీబీనగర్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు.
- వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వ వద్ద పైనుంచి ప్రవహిస్తున్న మూసీ
- చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలకు అంతరాయం.
- ముందస్తు చర్యగా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.
- మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
- మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక.
పురానాపూల్‌లో వరద బీభత్సం..
- పురానాపూల్‌లో నీట మునిగిన శివుడి ఆలయం.
- శివుని దేవాలయంలో ఉన్న పూజారి కుటుంబం
- ఆలయంలో ఉండిపోయిన పూజారి కుటుంబం
- శివుడి దేవాలయం పైభాగం వరకు చేరుకున్న వరద నీరు
- సహాయం కోసం ఆలయం పైకెక్కి అర్తనాదాలు చేస్తున్న పూజారి కుటుంబం
- గుడి సమీపంలో నివాసం ఉంటున్న పూజారి కుటుంబం
- మొదటి అంతస్థులో చేరి సహాయం కోసం ఎదురుచూపులు
TELANGANA RAINFALL FORECAST | 27TH SEPTEMBER
DEPRESSION EFFECT DAY-3 (FINAL)
Depression is currently over NORTH-EAST TELANGANA and will move towards MARATHWADA region by night.
WEST & CENTRAL Telangana:
Widespread HEAVY RAINS likely, with Localized VERY HEAVY RAINS in a few… pic.twitter.com/1UVqcmJPse— Hyderabad Rains (@Hyderabadrains) September 27, 2025
వర్షాలపై సీఎం రేవంత్ ఆరా..
- రాష్ట్రంలో వర్షాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- హైదరాబాద్‌లో వరద, సహాయక చర్యల గురించి ఆరా తీసిన సీఎం
- మూసీ వెంట లోతట్టు ప్రాంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
- లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశం
- ముంపు కాలనీల వాసులకు పునరావాసం కల్పించాలని సీఎం ఆదేశం
రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం
- చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు
- దేవరంపల్లివాగు నుంచి హిమాయత్‌సాగర్‌లోకి భారీగా చేరుతున్న వరద
- పరివాహక ప్రాంతంలో నీటమునిగిన పొలాలు
- ప్రజల ఎవరిని రానివ్వకుండా అప్రమత్తం చేసిన పోలీసులు
ప్రయాణికులను బయటకు తరలించాం: అధికారి
- ఎంజీబీఎస్ అధికారి కామెంట్స్..
- రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లోకి వరద వస్తోంది
- ఎంజీబీఎస్ వద్ద వరద దృష్ట్యా ప్రయాణికులను బయటకు తరలించాం
- తాత్కాలికంగా ఎంజీబీఎస్‌లోనికి బస్సులు అనుమతించడం లేదు
- వరద ప్రవాహం దృష్ట్యా ఎంజీబీఎస్‌లోని బస్సులు బయటకు పంపించాం
- వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించాం
- ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ వరకే అనుమతి
- కర్నూలు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వద్ద మళ్లింపు
- వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతి
- ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే అనుమతి
- రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్‌లు మార్చాం
- రేపు మరో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారు
చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై ఆరు అడుగుల మేర వరద
- చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై 6 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద
- మూసారంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర ప్రవహిస్తున్న వరద
- వరద నీటిలో కొట్టుకుపోయిన నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామగ్రి
- వరద నీటిలో కొట్టుకుపోయిన స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రి
- ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ నది
- ఎంజీబీఎస్‌కు వచ్చే రెండు వంతెనల పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు
- ఎంజీబీఎస్‌లో ప్రయాణికులను ఖాళీ చేయించిన అధికారులు
- ఎంజీబీఎస్ వద్ద డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు
- సురక్షితంగా ప్రాంతాలకు బస్సులను తరలించిన అధికారులు
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
- మూసీ పరివాహక ప్రాంతంలోని మూసానగర్, శంకర్‌నగర జలమయం
- మూసానగర్, శంకర్‌నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు
- మూసానగర్, శంకర్‌నగర్‌లో ఇళ్లలోకి చేరిన మూసీ వరద నీరు
- కిషన్‌బాగ్, బాబానగర్ ప్రాంతాల్లో పెరిగిన మూసీ నది ప్రవాహం
- స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు
- బండ్లగూడ పటేల్‌నగర్‌లో ఇళ్లలోకి చేరిన మురుగు, వర్షపు నీరు
- మూసీ పరివాహక ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు
- లోతట్టు ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక, హైదరాబాద్‌లో(Hyderabad Rains) ఏకధాటిగా కురుస్తున్న వానలతో జంట జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరడంతో గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
#Hyderabad MGBS busstand 😳😳😳. This is grater hyderabad 😟😟😟😟😟 pic.twitter.com/OrLN4oUum7
— Harsha💥 (@2Ysjagan) September 27, 2025
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ(Moosi River) నది మహోగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దీంతో, ఎంజీబీఎస్‌లోకి(MGBS Bus Stand) వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. ఈ క్రమంలో మూసీ వరద ఎంజీబీఎస్ బస్డాండ్‌లోకి చేరింది. ఒక్కసారిగా వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


రెండు రోజులు భారీ వర్షాలు
తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ మరింత బలపడి వాయవ్య, దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Severe Flooding Hits Hyderabad’s MGBS Bus Station,
Overflowing Musi River has flooded the bus station, stranding hundreds. NDRF is conducting rescue operations. People are advised to avoid the area.#HyderabadRains #MGBS #Musi#HyderabadFloods pic.twitter.com/KomggkYYoX— Hakku Initiative (@HakkuInitiative) September 26, 2025
Current situation at MGBS .. pic.twitter.com/4QS6qdKAXG
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) September 26, 2025
Musi overflow Near Mgbs, Koti
Be carefull Hyderabad vasiyoooo ✅@revanth_anumula @GHMCOnline #Hyderabadrains #monsoonrains pic.twitter.com/m8xYIPOXW9— 𝙊𝙓𝙓𝙔🐉🀄️ (@Oxxy_7) September 26, 2025