సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజ్‌భవన్(లోక్‌భవన్) వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. లోక్‌భవన్ వద్ద ప్రజలను కలుస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ప్రజల అక్కడికి తరలివచ్చారు. కానీ, పోలీసులు మాత్రం అక్కడికి వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. దాదాపు గంట పాటు బయటే నిల్చోబెట్టారు. దీంతో, లోక్‌భవన్ వద్దకు వచ్చిన పిల్లలు, వృద్ధులు.. తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. గంట తర్వాత వారిని లోక్‌భవన్‌లోకి అనుమతి ఇవ్వడంతో గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


