విలువల విద్యతో దేశ సమగ్రత | - | Sakshi
Sakshi News home page

విలువల విద్యతో దేశ సమగ్రత

Feb 20 2026 11:08 AM | Updated on Feb 20 2026 11:26 AM

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ 

కుత్బుల్లాపూర్‌: విలువలతో కూడిన విద్య, నైతికత దేశ సమగ్రతకు తోడ్పాటునందిస్తాయని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. జీడిమెట్లలో బీడీఎల్‌ ఆధ్వర్యంలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో పాటు రెడ్‌క్రాస్‌, ఎన్‌సీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటూ దేశ బలోపేతానికి పాటుపడాలని సూచించారు. 

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణ కేంద్రానికి బాడెన్‌ పావెల్‌ మెమోరియల్‌ హాల్‌ నామకరణం చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎం.దానకిషోర్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ బీఎస్‌శర్మ, బీడీఎల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ గాయత్రి ప్రసాద్‌, జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) విజయేందర్‌ రెడ్డి, ఆర్డీఓ శ్యామ్‌ ప్రకాష్‌, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌ కుమారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement