కలకాలం తోడుగా కలిసుంటామని ప్రమాణం చేసి ఒక్కటైన దంపతులు.. వయసు మీరినా ఆ బాంధవ్యం చెరిగిపోనిదని.. నాకు నువ్వు...నీకు నేనంటూ ఆదర్శంగా నిలుస్తున్నారీ వృద్ధ దంపతులు. మండలంలోని నామాపూర్‌కు చెందిన శ్రీగాధ ఎల్లయ్య, చంద్రకళ దంపతులు మంగళవారం పింఛన్ డబ్బుల కోసం ముస్తాబాద్‌లోని బ్యాంకుకు వచ్చారు. మధ్యాహ్నం కావడంతో పక్కన ఉన్న హోటల్‌కు టిఫిన్ చేసేందుకు వెళ్లారు.
అయితే మిగిలిన పూరీలను నువ్వు తినయ్య అంటూ చంద్రకళ ఇస్తుంటే, మనం ఇంటికిపోయే సరికి ఏ యాళ్ల అవుతుందోనంటూ తన ప్లేటులో మిగిలిన పూరీని చంద్రకళకు ఇచ్చాడు. వారిని చూసిన చుట్టుపక్కల వారు భార్యాభర్తల బాంధవ్యం, ప్రేమకు వయసు అడ్డురాదని, దంపతులు ఒకరికొకరు బాధ్యతగా ఉండడం అవసరమని పేర్కొన్నారు. అయితే ఆ దంపతుల ఒక్కాగానొక్క కొడుకు బాలరాజు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకు జ్ఞాపకాలతో ఉన్నదాంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. వీరి అన్యోన్నాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. రాజన్న సిరిసిల్ల


