నాలుగు రోజుల తర్వాత.. మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?

Hyderabad: Woman Dead Body In Musi River - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు రోజుల క్రితం హుస్సేన్‌ సాగర్‌ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీలో లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది.

కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్‌ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు.

గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్‌ నాలాకు రిటర్నింగ్‌ వాల్‌ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్‌ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు.

చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు?  

మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్‌ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. కాగా, మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top