
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రాజెక్ట్‌లు, నదులు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మూసీ వరద నీటితో నిండిపోయింది. దీంతో, అధికారులు.. ఈరోజు మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం మూసీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. మూడో, ఎనిమిదో గేటును ఓపెన్ చేసి నీటికి దిగువకు విడుదల చేశారు అధికారులు. మూసీ రెండు గేట్ల ద్వారా 1293 క్యూసెక్కుల నీటి విడుదలవుతోంది. అయితే, ముందుగా రెండు గేటును తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా.. మొరాయించడంతో సమస్య ఎదురైంది. దీంతో, అధికారులు.. మూడో గేటును ఓపెన్ చేశారు. కాగా, మూసీ ప్రాజెక్ట్ గేట్లకు సంబంధించి గత వేసవిలోనే మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ చేయకపోవడంతో సమస్య తలెత్తింది.