
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిపై వంతెనలు నిర్మించాలనే హైదరాబాద్ ప్రజల చిరకాల కోరిక కాంగ్రెస్ పాలనలో సాకారం కావట్లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మూసీపై బ్రిడ్జీల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న అలసత్వాన్ని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఎండగట్టారు. ‘మూసీ నదిపై రాకపోకలను సులభతరం చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో రూ.545 కోట్లతో 15 వంతెనలు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి’ అని పేర్కొన్నారు.
‘సింగూరు డ్యామ్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఎన్‌డీఎస్‌ఏ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్‌కు సింగపూర్ తెలుగు సమాజం ఆహ్వానం సింగపూర్‌లోని తెలుగు సాంస్కృతిక సంస్థ ‘సింగపూర్ తెలుగు సమాజం’.. ఈ నెల 31న జరిగే తమ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు కేటీఆర్‌కు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి లేఖ రాశారు.