
స్టార్ హీరోహీరోయిన్లందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు.

కోలీవుడ్ స్టార్ జంట రాజ్‌కుమార్ సేతుపతి- శ్రీప్రియ చెన్నైలోని తమ ఇంట్లోనే అక్టోబర్ 4న ఈ పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలో 31 మంది స్టార్స్ పాల్గొన్నారు. వారిలో చిరంజీవి, వెంకటేశ్, శరత్‌కుమార్, నరేశ్, నదియా, జాకీ ష్రాఫ్, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, సుమలత, ఖుష్బూ, భాగ్యరాజ్, లిస్సీ, సురేశ్, మేనక, మీనా, సరిత, ప్రభు, రేవతి, శోభన, భానుచందర్.. తదితరులున్నారు.















