బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. కేటీఆర్‌కు అనిరుధ్‌ రెడ్డి కౌంటర్‌ | Congress MLA Anirudh Reddy Strong Political Counter To KTR | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. కేటీఆర్‌కు అనిరుధ్‌ రెడ్డి కౌంటర్‌

Oct 1 2025 10:39 AM | Updated on Oct 1 2025 10:52 AM

Congress MLA Anirudh Reddy Strong Political Counter To KTR

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) వ్యాఖ్యలకు తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి కౌంటరిచ్చారు. కేటీఆర్‌ గారూ.. ప్రతీదీ రాజకీయం చేయవద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు.

జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి(MLA Anirudh Reddy) తాజాగా మాట్లాడుతూ.. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణం చూడకండి కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌లో ఒక ఎమ్మెల్యే ఏ రోజైనా తనకు సంబంధించిన విషయంపై మాట్లాడారా?. ప్రజలకు కావాల్సిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా?. మా పార్టీలో.. మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన నిరంకుశత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే మీ పార్టీని బొంద పెట్టారు.

నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల  కోసం ఫైట్ చేస్తున్నా. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని ఎప్పుడు కూడా ఈ సమస్యపై మాట్లాడలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ సర్కార్‌ కాదు.. సర్కస్‌: కేటీఆర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement