
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల అనంతరం భవానీల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా రికార్డు స్థాయిలో భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దీక్షతో ఇరుముడులను ధరించి ఇంద్ర కీలాద్రికి తరలివచ్చిన భవానీల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

వినాయకుడి గుడి క్యూలైన్లతో పాటు కుమ్మరిపాలెం క్యూలైన్లు భవానీ భక్తులతో కిటకిటలాడాయి.























