
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao). భారీ వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy).. మీ బురద రాజకీయాలకు కాసేపు పక్కనపెట్టి వరదల్లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హితవు పలికారు.
మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా.. తీవ్ర వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించినా.. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్.
వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం❌
ప్రణాళికలు వేయడంలో వైఫల్యం❌
ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం❌
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్!. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBSలో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి!. పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి.
రేవంత్ రెడ్డి గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం అంటూ పోస్టు పెట్టారు.
తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు.
ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు.
ఇది దుర్మార్గం.
ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్.
వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం❌
ప్రణాళికలు వేయడంలో వైఫల్యం❌
ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం❌
ప్రభుత్వ… pic.twitter.com/qOQpG6hfaT— Harish Rao Thanneeru (@BRSHarish) September 27, 2025