
మూసీ ఉధృతికి హైదరాబాద్ చాదర్‌ఘాట్ సమీపంలో నీట మునిగిన ఇళ్లు
శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పొంగిన నది
నీట మునిగిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్
పరీవాహక ప్రాంత కాలనీలన్నీ జలమయం
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్
ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికుల తరలింపు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది హైదరాబాద్‌ను శుక్రవారం రాత్రి అతలాకుతలం చేసింది. నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవటంతో నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నడూ లేనివిధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ను కూడా వరద ముంచెత్తి్తంది. ఒక్కసారిగా వరదనీరు బస్ స్టేషన్‌లోకి చొచ్చుకురావటంతో ప్రయాణి కులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్ స్టేషన్‌లోని ప్రయాణికులను హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తరలించారు. ముందుజాగ్రతగా మూసీ నదిపై ఉన్న లోలెవలె వంతెనలన్నీ మూసివేశారు. పురాణాపూల్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ కాజ్‌వేలను మూసివేస్తూ ట్రాఫిక్ పోలీసు చీఫ్ జోయల్ డెవిస్ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు.

ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులను తరలిస్తున్న దృశ్యం
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీనదికి భారీ వరద పోటెత్తింది. దీంతో శుక్రవారం రాత్రి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ముందస్తు హెచ్చరిక చేయకుండానే ఎత్తివేశా రు. దీంతో దిగువన ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. వెంటనే స్పందించిన హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎస్ విభాగాలు.. మూసీ వెంట ఉన్న కాలనీల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు, పోలీసులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కాగా, 1908లో కూడా సెప్టెంబర్ 26నే మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వరదలకు వేలాది మంది ప్రాణా లు కోల్పోగా, దాదాపు 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. మళ్లీ ఇప్పుడు సెపె్టంబర్26నే మూసీ వరద ముంచెత్తడంతో నాటి సంఘటనలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.