జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సియం ఎ.రేవంత్ రెడ్డి | Congress Govt Committed to Welfare of Journalists: Revanth | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సియం ఎ.రేవంత్ రెడ్డి

Jan 1 2026 10:30 PM | Updated on Jan 1 2026 10:30 PM

Congress Govt Committed to Welfare of Journalists: Revanth

హైద్రాబాద్: జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో సియంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. అలాగే యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది. ఈ సందర్భంలో జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ముఖ్యమంత్రిని కోరగా, ఆయన పై విధంగా స్పందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అజిత, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియుద్దీన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరీష్ లు ఉన్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యూనియన్ ప్రతినిధి బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

సీయంకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను  కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement