mahatma gandhi bus station
-
100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ఆర్టీసీ మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. నగరంలో ప్రధాన బస్ టెర్మినల్‌గా ఉన్న మహాత్మాగాంధీ బస్‌స్టాండ్ (ఎంజీబీఎస్) స్థాయిలో దీనిని నిర్మించే యోచనలో ఉంది. అంతర్రాష్ట్ర బస్సు సర్విసులకు ఒక టెర్మినల్, సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం బస్ డిపో, బ్యాటరీ బస్సుల కోసం భారీ చార్జింగ్ సెంటర్.. ఇలా సమీకృత కేంద్రంగా ఇది రూపొందనుంది. దీని నిర్మాణానికి జీడిమెట్ల ప్రాంతంలో ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది. దశలవారీగా దీనిని అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ సమాయత్తమవుతోంది. రోడ్లపై బస్సులు ఆగకుండా.. కేపీహెచ్‌బీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొచ్ఛాయి. కొత్త కాలనీలు శరవేగంగా రూపొందుతున్నాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో బస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లమీదనే ఆగుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో మెదక్ రీజియన్ నుంచి అంతర్రాష్ట్ర, రాష్ట్ర సర్విసులు వచ్చి రోడ్ల మీదనే ఆగుతున్నాయి.భవిష్యత్‌లో దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి వెళ్లకుండా ఇక్కడే నిలిచిపోయేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికీ చాలా బస్సులు పటాన్చెరు, బీహెచ్ఈఎల్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు నెలకొంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, బస్సులు రోడ్లమీద ఆగకుండా ప్రత్యేకంగా ఓ టెర్మినల్ నిర్మించి అందులోనే ఆగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్సుల కోసం టెర్మినల్ నిర్మించనున్నారు. నైట్‌హాల్ట్ బస్సుల కోసం జగద్గిరిగుట్ట వద్ద దాదాపు 60 వరకు బస్సులు నైట్‌హాల్ట్‌లో ఉంటున్నాయి. వాటిని నిలిపేందుకు సరైన చోటు లేకపోవటంతో రోడ్ల మీదనే ఆపుతున్నారు. నైట్‌హాల్ట్ బస్సు సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీ సర్వీసులకు సిటీ టెర్మినల్ కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, బాచుపల్లి, గండిమైసమ్మ, గాజులరామారం... ఇలా ఈ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న వందల సంఖ్యలోని కాలనీలకు వెళ్లి వచ్చే సిటీ బస్సులకు కూడా టెర్మినల్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అంతర్రాష్ట్ర సర్వీసులతోపాటు సిటీ బస్సులకు కూడా ఇక్కడ సిటీ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారు. 20 ఎకరాలలో సిటీ టెర్మినల్ నిర్మించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సు డిపో భవిష్యత్‌లో నగరంలో ఆర్టీసీ సర్వీసులన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉండనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద తెలంగాణ ఆరీ్టసీకి కేంద్రం 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరో ఆరు నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో ఆ బస్సులు సమకూరనున్నాయి. వాటి కోసం ప్రస్తుతం ఉన్న డిపోలు కాకుండా కొత్తగా పది డిపోల వరకు నిర్మించాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. ఇక్కడ భారీ డిపోను నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆ డిపో ఉండనుంది. చార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు ఛార్జింగ్ స్టేషన్ అవసరం. ఇక్కడి డిపో బస్సులతోపాటు, అంతర్రాష్ట్ర బస్సులు, ఇతర బస్సులకు ఛార్జింగ్ వసతి కలి్పంచేలా ఇక్కడ 15 ఎకరాలలో ఛార్జింగ్ స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. మల్టీలెవల్ పార్కింగ్ యార్డ్ టెర్మినల్‌కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రానున్నందున ఇక్కడ ఓ మల్టీలెవల్ పార్కింగ్ యార్డు కూడా రూపొందనుంది. దాన్ని భూగర్భంలో నిర్మించే యోచనలో ఉన్నారు. -
మూసీ ముంచేసింది..
సాక్షి, హైదరాబాద్: మూసీ నది హైదరాబాద్‌ను శుక్రవారం రాత్రి అతలాకుతలం చేసింది. నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవటంతో నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నడూ లేనివిధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ను కూడా వరద ముంచెత్తి్తంది. ఒక్కసారిగా వరదనీరు బస్ స్టేషన్లోకి చొచ్చుకురావటంతో ప్రయాణి కులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్ స్టేషన్‌లోని ప్రయాణికులను హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తరలించారు. ముందుజాగ్రతగా మూసీ నదిపై (Musi River Floods) ఉన్న లోలెవలె వంతెనలన్నీ మూసివేశారు. పురాణాపూల్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ కాజ్‌వేలను మూసివేస్తూ ట్రాఫిక్ పోలీసు చీఫ్ జోయల్ డెవిస్ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులను తరలిస్తున్న దృశ్యంరంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీనదికి భారీ వరద పోటెత్తింది. దీంతో శుక్రవారం రాత్రి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ముందస్తు హెచ్చరిక చేయకుండానే ఎత్తివేశా రు. దీంతో దిగువన ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. వెంటనే స్పందించిన హైడ్రా, ఎస్డీఆర్ఎస్ విభాగాలు.. మూసీ వెంట ఉన్న కాలనీల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు, పోలీసులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.కాగా, 1908లో కూడా సెప్టెంబర్ 26నే మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వరదలకు వేలాది మంది ప్రాణా లు కోల్పోగా, దాదాపు 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. మళ్లీ ఇప్పుడు సెపె్టంబర్26నే మూసీ వరద ముంచెత్తడంతో నాటి సంఘటనలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. -
‘అఫ్జల్‌గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
ప్రజా రవాణాతోనే సురక్షిత ప్రయాణం
అఫ్జల్‌గంజ్/సాక్షి, హైదరాబాద్: సురక్షితమైన ప్రయాణానికి ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేశారు. వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల సౌకర్యార్థం సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాంల వరకు ప్రయాణికులను చేరవేసేందుకు వీలుగా నూతన బగ్గి వాహన సేవల్ని ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రధాన బస్స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్ ఉన్న తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. -
హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద పేలుడు
హైదరాబాద్: రాజధాని నగరంలోని ప్రఖ్యాత మహాత్మాగాంధీ బస్‌స్టేషన్(సీబీఎస్, ఇమ్లీబన్ స్టేషన్) వద్ద మంగళవారం రాత్రి కలకలం రేగింది. బస్‌స్టేషన్ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిప్పు అంటుకోవడంతో అక్కడే నిలిపిఉన్న పలు వాహనాలు తగలబడ్డాయి. ఎంజీబీఎస్.. నిత్యం లక్షల్లో ప్రయాణికులు వచ్చిపోయే ప్రదేశం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆస్తి నష్టం రూ.4 కోట్లు ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్టుసర్క్యూట్‌తో మంటలు చేలరేగాయి పది ఫైరింజన్లతో ప్రయత్నించినప్పటికీ ఎంతకీ మంటలు అదుపులోకి రాలేదు. 132 కెవీఎం ట్రాన్స్ఫార్మర్ కావడంతో అందులో సుమారు 47,000 లీటర్ల ఆయిల్ ఉంటుందని, అందువల్ల మంటలు భారీగా వ్యాపించాయని చెబుతున్నారు. చివరకు ఫోమ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం రూ.4 కోట్ల వరకు జరిగింది అని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
హైహై... వైఫై!
ఫ్రీ వైఫైకి విశేష స్పందన నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్లు టాప్ త్వరలో నగర వ్యాప్తంగా 3 వేల హాట్స్పాట్లు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు సిటీబ్యూరో: ఉచిత వైఫై సేవలకు సిటీజనుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. నగరంలో 15 చోట్ల బీఎస్ఎన్ఎల్ సంస్థ 20 నిమిషాల చొప్పున ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసింది. క్రమంగా వీటి సంఖ్య పెంచుతోంది. దీనికి స్పందన అదే స్థాయిలో ఉంటోంది. నెక్లెస్ రోడ్లో వారానికి సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వైఫై వినియోగమవుతోందని... 8.83 టెరాబైట్ల డేటాను వినియోగదారులు వాడుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్ల మేర 10.63 టెరాబైట్ల డేటా వినియోగించినట్లు తెలిసింది. ఆ తరవాత స్థానంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. కనిష్టంగా బిర్లా ప్లానిటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ వద్ద 580 సెషన్స్ మేర వైఫై వినియోగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. 3 వేల హాట్స్పాట్లు నగర వ్యాప్తంగా వైఫై సేవల విస్తరణకు 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడం... హాట్స్పాట్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా సహకారం అందితే మరో ఆరు నెలల్లో 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. నగరంలో తమ సంస్థకు 4,500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది. వినియోగంలో సమస్యలివీ.. ఉచిత వైఫై వినియోగంలో పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాది మంది వైఫై సేవలకు ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని... ఒక్కోసారి కనెక్ట్ కావడం లేదని నెక్లెస్ రోడ్‌పై వైఫై వినియోగిస్తున్న పలువురు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు అందడం లేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. వినియోగించే తీరిదీ మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌ను క్లిక్ చే సి మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్ చేయాలి.ఆ తరవాత మొబైల్‌కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు అందుతాయి.ఆ తరవాత వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదా హాట్స్పాట్లు ఉన్నచోట బీఎస్ఎన్ఎల్ విక్రయించే కూపన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయోజనాలివీ.. ఆన్లైన్లో అనుసంధానించినసుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. వెఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటే చాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే వీలుంటుంది. కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. -
కవ్విస్తున్న వ్యభిచారిణుల అరెస్ట్
హైదరాబాద్: అసభ్యకర చేష్టలు, సైగలతో విటులను ఆకర్షించేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యభిచారిణులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం...గౌలిగూడలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో విటులను ఆకర్షించేందుకు ఉప్పల్‌కు చెందిన నలుగురు వ్యభిచారిణులు ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులకు సైగలు చేస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎంజీబీఎస్ ప్రాంగణంలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వ్యభిచారిణులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


