ప్రజా రవాణాతోనే సురక్షిత ప్రయాణం | TSRTC MD Sajjanar New Year Celebrations At Mahatma Gandhi Bus Station | Sakshi
Sakshi News home page

ప్రజా రవాణాతోనే సురక్షిత ప్రయాణం

Jan 2 2022 1:47 AM | Updated on Jan 2 2022 1:47 AM

TSRTC MD Sajjanar New Year Celebrations At Mahatma Gandhi Bus Station - Sakshi

ప్రయాణికులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న సజ్జనార్‌  

అఫ్జల్‌గంజ్‌/సాక్షి, హైదరాబాద్‌: సురక్షితమైన ప్రయాణానికి ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరించాలని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. శనివారం మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రయాణికులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల సౌకర్యార్థం సీబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాంల వరకు ప్రయాణికులను చేరవేసేందుకు వీలుగా నూతన బగ్గి వాహన సేవల్ని ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రధాన బస్‌స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌ ఉన్న తన కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement