Komatireddy Venkat Reddy Sensational Comments On CM KCR - Sakshi
Sakshi News home page

హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడు: కోమటిరెడ్డి

Aug 8 2021 3:26 PM | Updated on Aug 8 2021 8:15 PM

Komatireddy Venkat Reddy Criticized That If Hitler ALive He Would Cry See To KCR - Sakshi

ఫైల్‌ ఫోటో

ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరని...

హైదరాబాద్‌: మూసీ నదిని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో మాట్లాడుతానని ఆయన అన్నారు.  హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని కోమటిరెడ్డి విమర్షించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రికి రెండు సార్లు వస్తే.. ఎంపీగా నాకు సమాచారం ఇవ్వలేదన్నారు.

ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరని దుయ్య బట్టారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడినట్లన్నారు. దళితులకు కేబినెట్‌లో స్థానం లేదు గాని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు తెలుసని విమర్షించారు. 

Advertisement
 
Advertisement
Advertisement