‘రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా 46 మంది కాంగ్రెస్ నేతలు.. అధిష్టానానికి లేఖలు’ | Maheshwar Reddy Claims Congress Leaders Wrote to High Command Against CM Revanth | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా 46 మంది కాంగ్రెస్ నేతలు.. అధిష్టానానికి లేఖలు’

Jul 2 2026 3:48 PM | Updated on Jul 2 2026 3:55 PM

Maheshwar Reddy Claims Congress Leaders Wrote to High Command Against CM Revanth

సాక్షి,హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్‌కు లేఖలు రాశారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ఆరోపించారు. ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నెగెటివ్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే 46 మంది నాయకులు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని, రేవంత్‌రెడ్డిని మార్చాలంటూ పలువురు మంత్రులు సైతం అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం రేవంత్‌రెడ్డిని ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు మాత్రమే కాపాడుతున్నారని ఏలేటి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య కూడా విభేదాలు వచ్చాయని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించారని.. ఆ నివేదికను మనసులో పెట్టుకునే ఆమెకు ఎంపీ పదవి రాకుండా రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement