
టాలీవుడ్‌లో కేవలం వారం గ్యాప్‌లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ, అక్టోబర్ 2న రిషబ్‌శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్‌లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్‌శెట్టి నటించిన కాంతారనే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.
ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్‌ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే, కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్ ట్రైలర్ ఏకంగా 15 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్‌శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్ చేశారంటూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్‌కు కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్ దాటేసింది.
'హరి హర వీరమల్లు' ట్రైలర్‌కు 48 మిలియన్ల వ్యూస్ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వ్యూస్ కోసం బాట్స్ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్‌కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.