
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ సందడి చేశారు. అయితే, ఈవెంట్ కాస్త వర్షార్పణం అయింది. 'వర్షం లేదు..బొక్కా లేదు' అని తమన్ బహిరంగంగానే కామెంట్ చేసినప్పటికీ వాన మాత్రం ఊరుకోలేదు. వేదికపై ఉన్న లైట్ బాయ్ నుంచి పవన్ కల్యాణ్ వరకు అందర్నీ తడిపేసింది. దీంతో ఓజీ ఈవెంట్ కాస్త వర్షార్పణం కావడం ఆపై ట్రైలర్ కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, వేదికపై పవన్ కల్యాణ్ చేసిన కత్తిసాము వల్ల తన సెక్యూరిటీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఓజీ స్టేజీపై పవన్ కల్యాణ్ ఇలా వ్యాఖ్యలు చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా..? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు' అంటూ కత్తి పట్టుకుని స్టేజీపై పవన్ కల్యాణ్ తిప్పుతుండగా తన సెక్యూరిటీ కంటి దగ్గరి నుంచి వెళ్లింది. అయితే, అతను అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. లేదంటే తన కంటికి తీవ్రమైన ప్రమాదమే జరిగేది. అది ఒరిజనల్ కత్తి కాదని కొందరు.. లేదూ ఒరిజినల్ కత్తే అంటూ మరికొందరూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అది అతని కన్ను వద్ద తగిలింటే మాత్రం ఏ కత్తి అయినా సరే తీవ్రమైన నష్టం జరిగేదని చెప్పొచ్చు.
Just Miss 😲
pic.twitter.com/IG8mlaL5aX— Christopher Kanagaraj (@Chrissuccess) September 21, 2025