
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నెల 21 భారీస్థాయిలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్డేడియంలో ఓజీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.
అయితే ఎంతో ఆశతో ఈవెంట్‌కు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాసులు ఉన్న తమను లోపలికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు స్టేడియం గేటు బయటే వేచి చూశామని అభిమానులు వాపోయారు. మాకు పాసులు ఇచ్చిన లోపలికి పంపకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం అంతా ఖాళీగానే ఉందని.. తమను ఎందుకు పంపరని పోలీసులపై మండిపడ్డారు.
ఇది బైట ఉన్న Fans పరిస్థితి !🙏🏻
What a management of Telangana Police services truly excellent with this worst…#TheyCallHimOG #PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/ixIFG1Z1Dr— Karthikuuu (@Anchor_Karthik_) September 21, 2025