
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) తల్లి రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సమక్షంలో వరుణ్ తల్లి డా.రమణి పార్టీలో చేరారు. మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.రమణికి రాంచందర్‌రావు బీజేపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

తనకు సామాజిక సేవ, హిందుత్వ ఎజెండాతో పని చేయడం ఇష్టమని రమణి తెలిపారు. పార్టీకి మంచి పేరు తీసుకువచ్చేందుకు పనిచేస్తానన్నారు. ఎన్‌ఆర్‌ఐ విభాగం ద్వారా మరికొందరు పార్టీలో చేరేలా చర్యలు తీసుకుంటానని రమణి వెల్లడించారు.