'మండోదరి'గా పూనమ్ పాండే.. బీజేపీ ఎంట్రీతో తొలగింపు | Poonam Pandey Dropped from Mandodari Role in Delhi’s Prestigious Lav Kush Ramlila After Protests | Sakshi
Sakshi News home page

'మండోదరి'గా పూనమ్ పాండే.. బీజేపీ ఎంట్రీతో తొలగింపు

Sep 24 2025 8:52 AM | Updated on Sep 24 2025 10:56 AM

Poonam Pandey dropped from Ramleela cast Because Of BJP

ప్రతి ఏడాది ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే లవ్ కుశ్ రామ్‌లీలా ప్రదర్శన వివాదంలో చిక్కుకుంది. రావణుడి భార్య మండోదరి  (రావణుడి భార్య)  పాత్ర కోసం బాలీవుడ్‌  వివాదాస్పద నటి  పూనం పాండే(Poonam Pandey)ను ఎంపిక చేయడంతో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అభ్యంతరం తెలిపాయి. ఆమెను ఈ పాత్ర నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంతో లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ నిర్వాహకులు పూనమ్ పాండేను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.  

బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ , వీహెచ్‌పీ ప్రాంతీయ ప్రతినిధి సురేంద్ర జైన్ రాంలీలా కమిటీకి ఒక లేఖ రాశారు.  పూనమ్‌ పాండేను పౌరాణిక ఇతిహాసంలో నటించడం వల్ల ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. తరచూ వివాదాస్పదంగా ఉండే నటిని  మండోదరి పాత్ర కోసం ఎంపిక చేయడం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదని, తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని బీజేపీ నేతలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్‌ చేశాయి. పూనం పాండే తన సోషల్ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలతో పాటు కొన్ని వీడియోలతో  వివాదాల్లో నిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందితో పాటు యువత చూసే ఈ పవిత్ర కార్యక్రమానికి ఆమెను దూరంగా ఉంచడం మంచిదని పేర్కొన్నారు.

కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ.. ఒక కళాకారుడిని వారి గతాన్ని బట్టి కాకుండా వారి పనిని బట్టి అంచనా వేయాలన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూనమ్‌ పాండేను మండోదరి పాత్ర నుంచి తొలగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఆమె పట్ల అగౌరవంగా ఎవరూ చూడకూడదని పేర్కొంది. మండోదరి పాత్రలో నటించాలని ఆమె కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. అందుకోసం కొద్దిరోజులుగా ఉపవాసంతో పాటు చాలా నియమాలు పాటించిందని ఆయన గుర్తు చేశారు. కానీ, లవ్ కుష్ రామ్‌లీలా కమిటీ మాత్రం  ప్రజల మతపరమైన భావాలను ఎప్పుడూ గౌరవిస్తుంది.

దేశ రాజధాని ఎర్రకోట వద్ద ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా జరిగే లవ్ కుశ్ రామ్‌లీలా ప్రదర్శన అనేది ఢిల్లీలో జరిగే ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం. ఇక్కడ నవరాత్రులు, దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే రామాయణం కథను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి చాలా మంది బాలీవుడ్ మరియు టీవీ ప్రముఖులు, అలాగే అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, భారీ లైటింగ్, 3డి ప్రొజెక్షన్లు, ఇతర విజువల్ ఎఫెక్ట్స్ ఈ ప్రదర్శనను మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement