
తెలంగాణ కుంభమేళా నిర్వహించే మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ప్రపంచం కీర్తించేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

గిరిజన కొమ్ము కోయ నృత్యంతో, గిరిజన సంప్రదాయం ప్రకారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

మాస్టర్ ప్లాన్ పేరుతో రూపొందించిన గద్దెల నూతన డిజైన్లను విడుదల చేశారు. ఆలయం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆలయం పనుల ప్రారంభించారు. సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.















